మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో ఆదివారం ఉమ్మడి జిల్లా యోగా క్రీడాకారుల ఎంపికలు నిర్వహించారు. ఎంపికల్లో ఉమ్మడి జిల్లా నుంచి 86 మంది క్రీడాకారులు పాల్గొన్నట్లు జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తెలిపారు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యదర్శి కురుమూర్తిగౌడ్, జిల్లా యోగా సంఘం వర్కింగ్ చైర్మన్ రాములు, సలహాదారులు చెన్న వీరయ్య తదితరులు క్రీడాకారులను అభినందించారు. రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో పతకాలు సాధించి జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఎంపికల సందర్బంగా క్రీడాకారుల యోగా విన్యాసాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో సంఘం సభ్యులు ఆర్.బాలరాజయ్య, షంషేర్‌అలీ, వెంకటేశ్, రజనీ, మణికంఠ, నాగరాజు, బాలమణి, సాగర్, స్వప్న, శ్వేత తదితరులు పాల్గొన్నారు.


