పాలమూరు: మహబూబ్‌నగర్ నగరానికి చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, ఏఐఎంఐఎం జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ హాదీ (67) అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందారు. ఆయన మృతితో మహబూబ్‌నగర్‌తో పాటు ఉమ్మడి జిల్లాలోని ఎంఐఎం పార్టీ శ్రేణుల్లో విషాధచాయలు అలుముకున్నాయి. సుదీర్ఘ రాజకీయ అనుభవం గల అబ్దుల్ హాదీ రెండుసార్లు మహబూబ్‌నగర్ మున్సిపాలిటీలో ఎంఐఎం కౌన్సిలర్‌గా గెలుపొందారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఆయన విశేష సేవలు అందించారు. అబ్దుల్ హాదీ మృతి వార్త తెలుసుకున్న ఎంఐఎం శాసనసభపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ,చార్మినార్ ఎమ్మెల్యే జుల్ఫికర్ అలీ, రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ ఛైర్మన్ ఒబెదుల్లా కోత్వా ల్ ఆయన ఇంటికి చేరుకొని నివాళులర్పించి దువా చేశారు. అదే విధంగా డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్, డిప్యూటీ మేయర్ సురేందర్‌రెడ్డి, మాజీ మున్సిపల్ ఛైర్మన్ ఆనంద్‌గౌడ్ తదితరులు నివాళులు అర్పించారు.


