దేవరకద్ర: ఉల్లి ధర సామాన్య ప్రజలకు తినకుండానే ఘాటెక్కిస్తోంది. నాలుగు వారాలుగా ధరలు పెరుగుతూ రికార్డు స్థాయి చేరుకుంటున్నాయి. గడిచిన వారం రూ.5,200 వరకు ఉన్న ధర బుధవారం రూ. 5,600కు చేరింది. ఇక చిన్నపేడు ఉల్లికి కనిష్టంగా రూ. 3,200 పలికింది. మధ్యస్తంగా రూ.4,400 వరకు పలికాయి. సీజన్ లేకపోవడం వల్ల గత యా సంగి సీజన్‌లో నిల్వ చేసిన ఉల్లిని రైతులు అమ్మకానికి తెస్తున్నారు. మార్కెట్‌కు దాదాపు వంద క్వింటాళ్ల ఉల్లి అమ్మకానికి వచ్చింది. మార్కెట్ ధరల ప్రకారం 50 కేజీల బస్తా గరిష్టంగా రూ. 2800, కనిష్టంగా రూ.1,600కు అమ్మకాలు సాగించారు.


