నాణ్యత లేనిది లిక్కర్‌ ఫ్యాక్టరీలకు.. | - | Sakshi
Sakshi News home page

నాణ్యత లేనిది లిక్కర్‌ ఫ్యాక్టరీలకు..

Sep 4 2026 7:23 AM | Updated on Sep 4 2026 7:23 AM

మిల్లుల ఆవరణలో ఎండకు ఎండేలా.. వర్షానికి తడిసేలా వేసిన ధాన్యం బస్తాలు ఇప్పటికే పాడయ్యాయి. వీటిని చూపించే మిల్లర్లు బకాయిలు కట్టకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ నాణ్యత లేని ధాన్యాన్ని సైతం విక్రయించి సొమ్ము చేసుకునేందుకు మిల్లర్లు ఇదివరకే ప్లాన్‌ రెడీ చేసుకున్నట్లు వినికిడి. ఇథనాల్‌, లిక్కర్‌ ఫ్యాక్టరీలకు ముడిసరుకుగా బ్రోకెన్‌ రైస్‌ ఉపయోగపడుతుండడంతో ఆ ధానాన్ని నూకలుగా మార్చి తరలించేలా ఏర్పాట్లు చేసుకున్నట్లు సమాచారం. ఉమ్మడి పాలమూరులో రెండు చొప్పున ఇథనాల్‌, లిక్కర్‌ ఫ్యాక్టరీలు ఉండగా.. జిల్లాలో పేరుగాంచిన ఓ మిల్లర్‌ ఇప్పటికే మంత్రాంగం నడిపించినట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement