పాత పెన్షన్‌ కోసం.. మరో ఉద్యమం | - | Sakshi
Sakshi News home page

పాత పెన్షన్‌ కోసం.. మరో ఉద్యమం

Sep 4 2026 7:23 AM | Updated on Sep 4 2026 7:23 AM

జెడ్పీసెంటర్‌ (మహబూబ్‌నగర్‌): పాత పెన్షన్‌ విధానం (ఓపీఎస్‌) సాధన కోసం ఉద్యోగులు మరో ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను అమలు చేయడంతో పాటు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్‌ ఆవరణలో భారీ ధర్నా నిర్వహించారు. టీఎన్‌జీఓ, టీజీఓ, సీపీఎస్‌ ఉద్యోగుల సంఘాలతో పాటు వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యోగుల జేఏసీ జిల్లా చైర్మన్‌ రాజీవ్‌రెడ్డి మాట్లాడుతూ.. సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో సీపీఎస్‌ రద్దు అంశాన్ని పొందుపరిచిందని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వెంటనే ఓపీఎస్‌ను అమలు చేయాలని కోరారు. ఉద్యోగులను గత ప్రభుత్వం మోసం చేసిందని, ప్రస్తుత ప్రభుత్వం కూడా హామీని విస్మరిస్తే ఉద్యోగుల ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. పాత పెన్షన్‌ సాధన కోసం ఉద్యోగులు మరోసారి పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సమస్య పరిష్కారమయ్యే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు చంద్రకాంత్‌ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఓపీఎస్‌ను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. అప్పటివరకు ఉద్యోగుల పోరాటం కొనసాగుతుందని తెలిపారు. ‘సీపీఎస్‌ అంతం.. ఉద్యోగుల పంతంశ్రీ నినాదంతో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని ప్రకటించారు. కార్యక్రమంలో జేఏసీ జిల్లా కన్వీనర్‌ విజయ్‌కుమార్‌, డీఈఓ విజయకుమారి, డీఎస్‌ఓ శ్రీనివాస్‌, చంద్రనాయక్‌, కోశాధికారి కృష్ణమోహన్‌, నందకిషోర్‌, శ్యాంసుందర్‌రెడ్డి, బాలుయాదవ్‌, శ్యాంబాబు, కృష్ణకాంత్‌, మహేశ్వర్‌రెడ్డి, కృష్ణకుమార్‌గౌడ్‌, జుర్రు నారాయణ, కృష్ణయ్య, రాజేందర్‌, తాహేర్‌, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

సీపీఎస్‌ రద్దు చేసి ఓపీఎస్‌ అమలు చేయాలని ఉద్యోగుల డిమాండ్‌

ఇచ్చిన హామీని కాంగ్రెస్‌ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి

తెలంగాణ ఉద్యోగుల జేఏసీ జిల్లా చైర్మన్‌ రాజీవ్‌రెడ్డి

కలెక్టరేట్‌ వద్ద ఉద్యోగుల భారీ ధర్నా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement