అమ్మాయిల భద్రతపై నిరంతర నిఘా: ఎస్పీ | - | Sakshi
Sakshi News home page

అమ్మాయిల భద్రతపై నిరంతర నిఘా: ఎస్పీ

Sep 4 2026 7:23 AM | Updated on Sep 4 2026 7:23 AM

మహబూబ్‌నగర్‌ క్రైం: మహిళలు, విద్యార్థుల భద్రతకు షీటీం బృందా లు నిరంతరం నిఘా కొనసాగిస్తున్నాయని ఎస్పీ డి.జానకి తెలిపారు. ఆగస్టులో షీటీంకు 20 ఫిర్యాదులు అందగా 18 మందికి కౌన్సెలింగ్‌ ఇచ్చి, 17 మందిని రెడ్‌హ్యాండెడ్‌గా అదుపులోకి తీసుకున్నట్లు మంగళవారం ప్రకటనలో పేర్కొన్నారు. మూడు పెట్టీ కేసులు నమోదు చేయ డంతో పాటు 35 అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. 70 హాట్‌స్పాట్‌ ప్రాంతాల్లో నిఘా కొనసాగించామని వెల్లడించారు. విద్యాసంస్థలు, ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఇతర రద్దీ ప్రాంతాల్లో సివిల్‌ దుస్తుల్లో నిఘా ఉంటుందని తెలిపారు. ఈవ్‌టీజింగ్‌, ర్యాగింగ్‌, పోక్సో, గుడ్‌టచ్‌–బ్యాడ్‌టచ్‌, బాల్య వివాహాలపై విద్యార్థులు, ప్రజలకు అవగా హన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎవరైనా వేధింపులకు గురైతే వెంటనే 87126 59365కు సమాచారం ఇవ్వాలని సూచించారు.

15 వరకు చేయూత

పింఛన్లకు దరఖాస్తులు

జెడ్పీసెంటర్‌ (మహబూబ్‌నగర్‌): సామాజిక భద్రత పింఛన్ల కోసం ఈనెల 15వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని డీఆర్‌డీఓ నర్సిములు మంగళవారం ప్రకటనలో తెలిపారు. ఆగస్టు 31తో ముగియాల్సిన గడువును ప్రభుత్వం ఈనెల 15 వరకు పొడిగించిందని పేర్కొన్నారు. పట్టణ ప్రాంతాల వారు మున్సిపాలిటీల్లో, గ్రామీణ ప్రాంతాల వారు ఎంపీడీఓ కార్యాలయాల్లో గడువులోగా దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. అర్హులైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సాంకేతిక శిక్షణను

సద్వినియోగం చేసుకోవాలి

జడ్చర్ల: సాంకేతిక శిక్షణను సద్వినియోగం చేసుకుని నైపుణ్యాలను పెంపొందించుకోవాల ని సెట్విన్‌ కోఆర్డినేటర్‌ విజయ్‌కుమార్‌ అభ్యర్థులకు సూచించారు. మంగళవారం సెట్విన్‌లో శిక్షణ పొందుతున్న వారికి అభ్యసన సామగ్రిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పుస్తకాల ద్వారా పరిజ్ఞానాన్ని పెంచుకోవడంతో పాటు ప్రాక్టికల్‌ శిక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఇప్పటికే రెండు బ్యాచ్‌లు పూర్తయ్యాయని, ప్రస్తుతం మూడో బ్యాచ్‌లో 205 మందికి శిక్షణ కొనసాగుతోందని తెలిపారు. నాలుగో బ్యాచ్‌కు త్వరలో నోటిఫికేషన్‌ జారీ చేస్తామని వెల్లడించారు.

రైతులు చట్టాలపై

అవగాహన పెంచుకోవాలి

అడ్డాకుల: వ్యవసాయానికి సంబంధించిన చట్టాలు, రైతుల హక్కులపై వారు అవగాహన పెంచుకోవాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి డి.ఇందిర పేర్కొన్నారు. మండలంలోని రైతు వేదికలో వ్యవసాయ చట్టాలు, రైతు సంక్షేమ పథకాలు, వాటి పరిధి, ప్రయోజనాలపై మంగళవారం రైతులకు అవగాహన నిర్వహించారు. రైతులకు అందుబాటులో ఉండే న్యాయసేవలపై అవగాహన కల్పించారు. రైతులు తమకు ఎదురయ్యే న్యాయపరమైన సమస్యల పరిష్కారం కోసం డీఎల్‌ఎస్‌ఏ ద్వారా ఉచిత న్యాయ సహాయం పొందవచ్చని తెలిపారు. అనంతరం అడ్డాకుల ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో విద్యార్థులకు పోక్సో చట్టం, ఫ్రీ లీగల్‌ ఎయిడ్‌, నల్సా స్కీమ్‌ గురించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ శేఖర్‌, ఎస్‌ఐ మురళీ, ఏఓ బ్యూల, సర్పంచ్‌ దశరత్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement