గాజులపేటలో కలెక్టర్‌ కొరడా! | - | Sakshi
Sakshi News home page

గాజులపేటలో కలెక్టర్‌ కొరడా!

Aug 19 2026 12:48 AM | Updated on Aug 19 2026 12:48 AM

మహబూబ్‌నగర్‌ రూరల్‌: గ్రామపంచాయతీ పాలనలో నిబంధనలను ఉల్లంఘిస్తే ఉపేక్షించేది లేదని కలెక్టర్‌ ఖుష్బూగుప్తా స్పష్టం చేశారు. మంగళవారం గాజులపేట గ్రామపంచాయతీ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆమె.. పంచాయతీ తీర్మానాలు లేకుండానే నిధులు వినియోగించినట్లు గుర్తించారు. కార్యదర్శి చూపించిన కొన్ని తీర్మానాలు నకిలీవిగా ఉన్నట్లు తేలడంతో తీవ్రంగా స్పందించిన కలెక్టర్‌.. కార్యదర్శి చంద్రశేఖర్‌ను సస్పెండ్‌ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

నకిలీ తీర్మానాలపై ఆగ్రహం

పంచాయతీ రికార్డులు, నిధుల వినియోగానికి సంబంధించిన పత్రాలను కలెక్టర్‌ పరిశీలించారు. నిబంధనల ప్రకారం తీర్మానాలు లేకుండానే నిధులు ఖర్చు చేసినట్లు గుర్తించారు. కొన్ని తీర్మానాలు అనుమానాస్పదంగా ఉండటంతో వాటిపై ఆరా తీశారు. రికార్డుల నిర్వహణలో నిర్లక్ష్యంపై అధికారులను ప్రశ్నించారు. ప్రభుత్వ నిధుల వినియోగంలో పారదర్శకత, జవాబుదారీతనం తప్పనిసరిగా ఉండాలని ఆదేశించారు. గ్రామంలో దోమల నివారణకు వినియోగించే ఫాగింగ్‌ మిషన్లపైనా వివరాలు తెలుసుకున్నారు. ఎన్ని మిషన్లు ఉన్నాయి, వాటి నిర్వహణ రిజిస్టర్లు, వినియోగించిన వివరాలను పరిశీలించారు. పంచాయతీ ఆస్తులు, నిధులు, రికార్డుల విషయంలో నిర్లక్ష్యం వహించవద్దని హెచ్చరించారు.

విద్యార్థులతో ముఖాముఖి

గాజులపేట జెడ్పీహెచ్‌ఎస్‌ను సందర్శించిన కలెక్టర్‌ అక్షయపాత్ర ద్వారా అందుతున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. పదో తరగతి గదికి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. ఏ పాఠం జరుగుతోందని అడిగి తెలుసుకున్నారు. పాఠాలు అర్థమవుతున్నాయా, ఉపాధ్యాయులు సక్రమంగా బోధిస్తున్నారా, ఏమైనా సమస్యలు ఉన్నాయా అని ప్రశ్నించారు. తరగతి గదుల్లో విద్యుత్‌, ఫ్యాన్లు, లైట్ల సౌకర్యంపై ఆరా తీశారు. ప్రతి గదిలో అవసరమైన వసతులు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులు, సిబ్బందిని ఆదేశించారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా నాణ్యమైన విద్య అందేలా చూడాలని సూచించారు.

పంచాయతీ నిధుల వినియోగంలోఅక్రమాలు.. నకిలీ తీర్మానాలపై ఆగ్రహం

కార్యదర్శి సస్పెన్షన్‌కు ఆదేశం.. రికార్డులపై లోతుగా ఆరా

జెడ్పీహెచ్‌ఎస్‌లో విద్యార్థులతో కలెక్టర్‌ ముఖాముఖి

నిబంధనలు ఉల్లంఘిస్తే

కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement