మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను యథావిధిగా కొనసాగించాలని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక తెలంగాణచౌరస్తాలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ పథకాలను అమలు చేయొద్దనే ఉద్దేశంతోనే కోర్టు కేసు సాకుగా చూపిస్తున్నారని ఆరోపించారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం న్యాయపరంగా ముందుకు వెళ్లడంలో నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. మహిళలకు పెంచిన పింఛన్, విద్యార్థినులకు స్కూటీలు ఇవ్వాలని, ఫీజు రీయింబర్స్‌మెంట్ పాత బకాయిలు వెంటనే చెల్లించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేసేంతవరకు పోరాటం చేస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు రాజేశ్వర్‌గౌడ్, ముడా మాజీ చైర్మన్ గంజి వెంకన్న, మున్సిపల్ మాజీ చైర్మన్ నర్సింహులు, బీఆర్‌ఎస్ నాయకులు శివరాజ్, దేవేందర్‌రెడ్డి, కరుణాకర్ గౌడ్, రెహమాన్, ఆంజనేయులు, నరేందర్, లక్ష్మయ్య, గణేష్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


