కాంగ్రెస్‌ బలోపేతమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ బలోపేతమే లక్ష్యం

Aug 19 2026 12:48 AM | Updated on Aug 19 2026 12:48 AM

స్టేషన్‌ మహబూబ్‌నగర్‌: జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీని మరింత బలోపేతం చేయడం, క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించడంపై జిల్లా పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీ (పీఏసీ) సమావేశంలో చర్చించారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో మంగళవారం జరిగిన సమావేశానికి ఏఐసీసీ కార్యదర్శి సచిన్‌ సావంత్‌, రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి, డీసీసీ అధ్యక్షుడు సంజీవ్‌ ముదిరాజ్‌, ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. పార్టీ కార్యక్రమాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లడం, నాయకులు–కార్యకర్తల మధ్య సమన్వయం పెంచడం, ప్రజా సమస్యల పరిష్కారం, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయడం వంటి అంశాలపై నేతలు చర్చించారు. ఐక్యత, సమన్వయంతో పనిచేస్తూ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని సూచించారు.ఐక్యత, సమన్వయం, ప్రజాసేవే లక్ష్యంగా ప్రతి నాయకుడు, కార్యకర్త కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో నారాయణపేట జిల్లా ఇన్‌చార్జి శివారెడ్డి, మేయర్‌ గుమ్మాల మమత, జిల్లా ఎస్సీసెల్‌ చైర్మన్‌ పసుల రాజు, జిల్లా మైనార్టీ విభాగం చైర్మన్‌ ఫయాజ్‌, జిల్లా యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు అవేజ్‌ అహ్మద్‌, జిల్లా ఓబీసీ చైర్మన్‌ తిరుపతయ్య పాల్గొన్నారు.

● కాంగ్రెస్‌ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడమే లక్ష్యమని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. పీఏసీ సమావేశానికి సంబంధించి ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీ సంస్థాగత వ్యవహారాలు, భవిష్యత్‌ కార్యాచరణపై ఏఐసీసీ కార్యదర్శి నాయకులకు దిశానిర్దేశం చేసినట్లు తెలిపారు. సమావేశంలో ఎస్‌ఐఆర్‌పై చర్చ జరిగిందన్నారు. ప్రతినెల ఒక రోజు పీఏసీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. గత సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు, ఎంతవరకు అమలయ్యాయి, వాటి ఫలితాలు ఏమిటి అనే అంశాలపై తదుపరి సమావేశాల్లో సమీక్ష నిర్వహిస్తామని చెప్పారు.

జిల్లా పీఏసీ సమావేశంలో సంస్థాగత వ్యవహారాలు, భవిష్యత్‌ కార్యాచరణపై చర్చ

పాల్గొన్న ఏఐసీసీ కార్యదర్శి సచిన్‌ సావంత్‌, మంత్రి శ్రీహరి, ఎమ్మెల్యేలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement