త్వరితగతిన న్యాయం అందేలా చర్యలు: ఎస్పీ | - | Sakshi
Sakshi News home page

త్వరితగతిన న్యాయం అందేలా చర్యలు: ఎస్పీ

Aug 18 2026 7:22 AM | Updated on Aug 18 2026 7:22 AM

జెడ్పీసెంటర్‌(మహబూబ్‌నగర్‌): ప్రజలు అందించే ఫిర్యాదులను నిష్పక్షపాతంగా పరిశీలించి, సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని ఎస్పీ డి.జానకి పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ఆమె ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్‌లో మాట్లాడి సమస్యల పరిష్కారానికి అవసరమైన సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఫిర్యాదును చట్టబద్ధంగా పరిశీలించి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి పోలీసుశాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.

గంజాయి రహిత

జిల్లాగా పాలమూరు

ఎకై ్సజ్‌ డిప్యూటీ కమిషనర్‌

విజయభాస్కర్‌రెడ్డి

జెడ్పీసెంటర్‌(మహబూబ్‌నగర్‌): జిల్లాను గంజాయి రహితంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎకై ్సజ్‌ శాఖ డిప్యూటీ కమిషనర్‌ విజయభాస్కర్‌రెడ్డి కోరారు. మహబూబ్‌నగర్‌ ఎకై ్సజ్‌ డివిజన్‌ పరిధిలోని వివిధ స్టేషన్లలో నమోదైన 25 కేసుల్లో స్వాధీనం చేసుకున్న 15 కిలోల ఎండు గంజాయి, 400 గ్రాముల అల్ఫ్రాజోలంను సోమవారం ధ్వంసం చేశారు. డ్రగ్‌ డిస్పోజల్‌ కమిటీ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా ఎదులపల్లి గ్రామంలోని జీజే మల్టీ ఎన్‌క్లేవ్‌ ఇండస్ట్రీ ఇన్సినరేటర్‌లో వీటిని ధ్వంసం చేసినట్లు డీసీ తెలిపారు. స్వాధీనం చేసుకున్న మాదకద్రవ్యాల విలువ సుమారు రూ.20 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగంపై కఠినచర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అసిస్టెంట్‌ ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌ బి.శ్రీనివాస్‌, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

లా, ఇంజనీరింగ్‌

పరీక్షలు ప్రారంభం

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: పాలమూరు యూనివర్సిటీ పరిధిలో లా, ఇంజనీరింగ్‌ రెండో సెమిస్టర్‌ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పరీక్షల నియంత్రణాధికారి ప్రవీణ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసి ఏర్పాట్లను పరిశీలించారు. లా రెండో సెమిస్టర్‌ పరీక్షకు 80 మందికి 78 మంది హాజరుకాగా, ఇద్దరు గైర్హాజరయ్యారు. ఇంజనీరింగ్‌ పరీక్షకు 182 మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్షల్లో కాపీయింగ్‌కు తావులేకుండా పకడ్బందీగా నిర్వహించాలని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సౌకర్యాలు కల్పించాలని ప్రవీణ సూచించారు. సూపరింటెండెంట్‌ భూమయ్య, ఇంజనీరింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ చంద్రకిరణ్‌ పాల్గొన్నారు.

ఇంజనీరింగ్‌ కళాశాలలో స్పాట్‌ అడ్మిషన్లు

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: పాలమూరు యూనివర్సిటీ ఇంజనీరింగ్‌ కళాశాలలో మిగిలిన సీట్ల భర్తీకి ఈనెల 19, 20 తేదీల్లో స్పాట్‌ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్‌ రమేష్‌బాబు ఒక ప్రకటనలో తెలిపారు. కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌లో 23, డేటా సైన్స్‌లో 35, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌–మెషిన్‌ లెర్నింగ్‌లో 5 సీట్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు నిర్ణీత తేదీల్లో పీయూ ఇంజనీరింగ్‌ కళాశాలలో నిర్వహించే స్పాట్‌ అడ్మిషన్లకు హాజరుకావాలని సూచించారు. రోస్టర్‌ నిబంధనల ప్రకారం ప్రవేశాలు కల్పిస్తామని, టీజీఎప్‌సెట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. ఫీజులను ఎప్‌సెట్‌–2026 వెబ్‌సైట్‌లో ప్రకటించిన విధంగా చెల్లించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement