జిల్లాలో ఈ ఏడాది వర్షపా తం సాధారణం కంటే తక్కువగా నమోదవుతోంది. ఎ క్కువ రోజులు తేలికపాటి వర్షాలే కురవడంతో భూమిలోకి నీరు ఇంకే అవకాశం తగ్గింది. అందుకే భూగర్భ జలమట్టంలో ఆశించిన పెరుగుదల కనిపించలేదు. ప్రస్తుతం చెరువులు, వాగులు నిండకపోవడంతో సహజ రీచార్జ్ కూడా జరగడం లేదు. ఆగస్టులో భారీ వర్షాలు కురిస్తేనే భూగర్భ జలాలు మెరుగుపడే అవకాశం ఉంటుంది. రైతులు బోర్ల నీటిని అవసరమైన మేరకే వినియోగిస్తూ, సూక్ష్మ నీటిపారుదల పద్ధతులను అనుసరించడం మంచిది. వర్షపు నీటిని భూమిలోకి ఇంకించే రీచార్జ్ పిట్లు, ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయడం ద్వారా కూడా భూగర్భ జలాల సంరక్షణకు తోడ్పాటు లభిస్తుంది. – కె.శ్రీనివాసరావు,
జిల్లా భూగర్భజల శాఖ అధికారి


