25న కురుమూర్తిస్వామికి లక్ష పుష్పార్చన | - | Sakshi
Sakshi News home page

25న కురుమూర్తిస్వామికి లక్ష పుష్పార్చన

Jul 13 2026 1:22 AM | Updated on Jul 13 2026 1:22 AM

తొలి ఏకాదశి పురస్కరించుకొని ప్రత్యేక పూజలు

కురుమూర్తిస్వామి ప్రధాన ఆలయం

చిన్నచింతకుంట: భక్తుల ఆరాధ్య దైవం అమ్మాపు రం కురుమూర్తి స్వామి ఆలయంలో ఈ నెల 25న శయనేకాదశి (తొలి ఏకాదశి) పురస్కరించుకోని స్వామివారికి లక్ష పుష్పార్చన చేయనున్నట్లు ఆల య అర్చకులు, సిబ్బంది పేర్కొన్నారు. స్వామివారి ప్రధాన ఆలయ ప్రాంగణంలో వివిధ రకాల పూలమాలలతో మండపానికి అలంకరిస్తారు. స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలకు పట్టు వస్త్రాలు ధ రింపచేసి మండపంలో ఉంచుతారు. ఉమ్మడి పాలమూరు జిల్లా నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

నిర్వహించే కార్యక్రమాలు..

తొలి ఏకాదశిని పురస్కరించుకొని కురుమూర్తి స్వామి ఆలయంలో ఈ నెల25, 26 తేదీల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 25న ఉదయం 6 గంటలకు సుప్రభాతసేవ, 6:30 కి స్వామి, అమ్మవార్లకు పంచామృత అభిషేకం, 9 గంటలకు విశ్వక్‌సేన పూజ పుణ్యావచనం, 10 గంటలకు స్వామివారికి లక్ష పుష్పార్చన, రాత్రి 7 గంటలకు అమ్మవారికి కుంకుమార్చన, 8 గంటలకు ప్రదోషకాలం పూజ, 9 గంటలకు తీర్థ ప్రసాద వితరణ, 10 గంటలకు అఖండ భజన, 26న ఉదయం 7 గంటలకు సహస్ర నామార్చన, 9 గంటలకు మహానివేదన, 9:30 కు తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహిస్తారు.

పేర్లు నమోదు చేసుకోవాలి

తొలి ఏకాదశి పురస్కరించుకొని కురుమూర్తి స్వామి కి సహస్ర పుష్పార్చన జరిపించాలనుకునే భక్తులు ఆలయ కార్యనిర్వహణ అధికారి కార్యాలయంలో రూ.151 చెల్లించి తమ పేర్లు నమోదు చేసుకోవాలని ఆలయ ఈఓ మదనేశ్వరెడ్డి, చైర్మన్‌ బత్తుల బాల్‌రాజు కోరారు.

అఽధికసంఖ్యలో హాజరుకానున్న భక్తులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement