హత్య కేసులో నిందితుడి అరెస్టు | - | Sakshi
Sakshi News home page

హత్య కేసులో నిందితుడి అరెస్టు

Jul 13 2026 1:22 AM | Updated on Jul 13 2026 1:22 AM

గద్వాల క్రైం: వృద్ధురాలిని దారుణంగా కత్తితో పొడిచి హత్య చేసిన కేసులో నిందితుడుని ఆదివారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ శ్రీను తెలిపారు. పూర్తి వివరాలు.. గద్వాల పట్టణంలోని బీసీ కాలనీకి చెందిన తెలుగు శంకరమ్మ(65)ను అదే కాలనీకి చెందిన తెలుగు ఆంజనేయులు(అంజి) డీసీఎం డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. అయితే కొన్ని నెలల కిందట మృతురాలు దూషించిందని ద్వేషం పెంచుకున్నాడు. ఈ క్రమంలో శనివారం వృద్ధురాలు ఇంట్లో ఒక్కరే ఉండడం చూసి కత్తితో విచక్షణా రహితంగా దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి కుమార్తె జయమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నిందితుడు ఆదివారం ఉదయం బస్టాండ్‌ సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించినట్లు సీఐ తెలిపారు. నిందితుడి నుంచి హత్యకు వినియోగించిన కత్తి, బైక్‌ను స్వాధీనం చేసుకున్నామన్నారు. గద్వాల కోర్టులో హజరుపరచి రిమాండ్‌కు తరలించారు. కేసు చేధనలో పట్టణ ఎస్‌ఐ కల్యాణ్‌కుమార్‌, సాంకేతిక విభాగ సిబ్బంది చంద్రయ్య, కిరణ్‌ కీలకంగా వ్యవహరించినట్లు పేర్కొన్నారు

నిందితుడి ఇంటి వద్ద నిరసన..

శంకరమ్మను హత్య చేసిన ఆంజనేయులు ఇంటి వద్ద ఆదివారం మధ్యాహ్నం మృతదేహాంతో కుటుంబ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. విషయం తెలుసుకున్న పట్టణ పోలీసులు అక్కడికి చేరుకుని వారిని శాంతిపజేశారు. నిందితుడిని అరెస్టు చేశామని చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు వివరించడంతో నిరసన విరమించారు.

రిమాండ్‌కు తరలింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement