మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పీయూ జాతీయ సెమినార్‌ను వచ్చే నెల 7, 8 తేదీల్లో హైదరాబాద్ సమీపంలోని కన్హా శాంతి వనంలో నిర్వహించనున్నారు. కార్యక్రమానికి హాజరు కావాలని కోరుతూ పీయూ అధికారులు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావుకు హైదరాబాద్‌లో ఆహ్వానపత్రాన్ని అందజేశారు. కేంద్ర, రాష్ట్ర మంత్రులతో పాటు అధికారులు, విద్యావేత్తలు, పరిశోధకులు, నూతన ఆవిష్కర్తలు కూడా పాల్గొనున్నట్లు వీసీ శ్రీనివాస్ పేర్కొన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ రమేష్‌బాబు, ఓఎస్డీ మధూసూదన్‌రెడ్డి పాల్గొన్నారు.
బోటు ప్రమాదం నుంచి బయటపడ్డ పాలమూరువాసి
మహబూబ్‌నగర్ క్రైం: వియత్నాంలో జరిగిన బోటు ప్రమాదం నుంచి నగరవాసి త్రుటిలో తప్పించుకున్నాడు. నగరంలోని మెట్టుగడ్డ దగ్గర మొబైల్ దుకాణ నిర్వాహకుడు, లావా మొబైల్ ఫోన్ డిస్ట్రిబ్యూటర్ అయిన మహ్మద్ మక్తధీర్ కంపెనీ టూర్‌లో భాగంగా మూడు రోజుల కిందట వియత్నాం వెళ్లాడు. అందరికీ ఒకే దగ్గర బస కల్పించడంతో శనివారం ఉదయం ఆయనతోపాటు ఉన్న మిగతా టూరిస్టులు బోటులో సముద్రం లోపలికి వెళ్లారు. మొదటి నుంచి మక్తధీర్‌కు చెరువు, సముద్రం అంటే భయం ఉండటం వల్ల అతను బోటులో సముద్రంలోకి వెళ్లకుండా హోటల్ దగ్గరే ఉండిపోయాడు. నీళ్లు అంటే ఉన్న భయంతో లోపలికి వెళ్లకపోవడంతో బోటు ప్రమాదం నుంచి తప్పించుకున్నట్లయింది. ఈ ప్రమాదంలో తాను క్షేమంగా ఉన్నానని కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.
రెండు బైక్‌లు చోరీ..
వనపర్తి రూరల్: పట్టణంలో రెండుబైక్‌లు చోరీ జరిగిన సంఘటన మండలంలో చోటు చేసుకున్నది. రూరల్ ఎస్‌ఐ హృశికేష్ తెలిపిన వివరాల ప్రకారం.. గో పాల్‌పేట మండలం, పొలికెపాడుకు చెందిన దాసరి మహేష్ వ నపర్తిలో బబ్లూ మద్యం షాపువద్ద మార్చి నెల లో చోరీకి గురైందని, అలాగే అదేరోజు శ్రీనివాసపురం చెందిన బో గినిపవన్ మరికుంట లోని నారాయణ గ్రానైట్స్‌షాపు ఎదుట మరో బైక్‌చోరీకి గురైందని తెలిపారు. వీరిద్దరు బాధితులు ఆదివారం రూరల్‌పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని ఎస్‌ఐ తెలిపారు.


