కల్వకుర్తి రూరల్: దుందుభి నది పరివాహక ప్రాంతం నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్‌ఐ కురుమూర్తి హెచ్చరించారు. ఎలాంటి అనుమతులు లేకుండా తెలకపల్లి మండలంలోని దాసర్లపల్లి నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న టిప్పర్‌ను మండలంలోని రఘుపతిపేట పంచాయతీ పరిధిలోని రామగిరి వద్ద పట్టుకొని స్టేషన్‌కు తరలించినట్లు ఎస్‌ఐ వెల్లడించారు. టిప్పర్ యజమాని, డ్రైవర్‌పై కేసు నమోదు చేసి, విచారణ చేస్తున్నామని పేర్కొన్నారు.
రెండు ఇసుక ట్రాక్టర్లు..
ఉప్పునుంతల: మండల సరిహద్దులోని దుందుభి వాగు నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్లు శనివారం రాత్రి పట్టబడినట్లు ఎస్‌ఐ పుట్ట మహేష్ తెలిపారు. సదరు ట్రాక్టర్లను సీజ్ చేయడంతో పాటు ట్రాక్టర్ల యజమానులు వంగూరు మండలంలోని ఉల్పర గ్రామానికి చెందిన జిల్లెల వాసు, ముద్దమల్ల నాగేష్‌పై కేసులు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
చిన్నారిపై కుక్క దాడి
మన్ననూర్: స్థానికంగా వివి ధ కాలనీల్లో వీధి కుక్కల బెడద అధికమై ప్రజలను కరిచి గాయపరుస్తున్నాయ ని శ్రీలింగమయ్య కాలనీకి చెందిన అయోధ్య గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఆదివారం ఫిర్యాదు చేశాడు. తన కుమారుడు గ్రామంలోని వీధిలో ఆడుకుంటుండగా కుక్క కరిచి తీవ్రంగా గాయపరిచిందన్నారు. గతంలో కూడా వీధి కుక్కల బారిన పడి పలువురికి రక్త గాయాలైనట్లు తెలిపారు. గ్రామ పంచాయతీ అధికారులు, సిబ్బంది వీధి కుక్కల బెడద నుంచి గ్రామ ప్రజలకు రక్షణ కల్పించాలని వినతి పత్రంలో కోరారు.


