సస్యరక్షణ ఇలా..
అలంపూర్: వ్యవసాయంలో చిరుధాన్యాల సాగుతో అధిక లాభాలు గడించే అవకాశం ఉంటుంది. చిరు ధాన్యపు పంటల్లో కొర్ర ముఖ్యమైంది. కొర్రలలో పోషకాలతో పాటుగా ఔషద గుణాలు ఉన్నాయి. వీటిలో పిండి పదార్థాలు తక్కవగా పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఈ కారణంగా ఊబకాయంతో బాధపడేవారికి మంచి ఆహారంగా గుర్తించారు. వీటిని ఆహారంగా తీసుకోవడం ద్వారా చక్కెర వ్యాధిని, గుండె జబ్బులను ఇతర రోగాలను అదు పులో ఉంచుకోవచ్చు. దీంతో ప్రస్తుతం తరుణంలో కొర్రకు మంచి డిమాండ్ ఉందని రైతులు చిరుధాన్యాల సాగుపై దృష్టి పెట్టాలని మండల వ్యవసాయ అధికారి నాగార్జున రెడ్డి సూచించారు.
కొర్రసాగు ఇలా :
కొర్ర పంటను వానాకాలం పంటగా జూన్–జులైలో వేసవి పంటగా జనవరిలోనూ విత్తుకోవచ్చు.
రకాలు:కృష్ణదేవరాయ, నరసింహ్మారాయ, శ్రీలక్ష్మి, ఎస్‌ఐఏ 3085 రకాలు 80 నుంచి 85 రోజుల్లో కోతకు వస్తా యి. అలాగే ప్రసాద్, సూర్యనంది(ఎస్‌ఐఏ 3088) రకాలు 70 నుంచి 75 రోజుల్లో కోతకు రావడంతోపాటు అధిక దిగుబడి ఇస్తాయి.
విత్తన మోతాదు :
సాళ్లలో విత్తితే ఎకరాకు రెండు కిలోలు, వెదజల్లే పద్ధతిలో అయితే నాలుగు కిలోల విత్తనం సరిపో తుంది.కిలో విత్తనానికి రెండు గ్రాముల కార్బండిజ మ్‌తో విత్తన శుద్ధి చేయాలి. 25 సెం.మీ ఎడం ఉన్న సాళ్లలో మొక్కల మధ్య 10 సెం.మీ దూరం ఉండేలా విత్తుకోవాలి. అంతర్ పంటగా ప్రతి ఐదు సా ళ్లకు ఒక సాలు కంది వేయాలి. లేదా 2:1 నిష్పత్తిలో కొర్ర వేరుశనగ వేయవచ్చు. విత్తిన రెండు వారా ల్లోపు ఒత్తు మొలకలను తీసివేయాలి. 30 రోజుల వరకు పంట పొలంలో కలుపు మొక్క లు లేకుండా చూడాలి. విత్తిన 20 నుంచి 25 రోజుల తర్వాత సాళ్లల్లో అంతర్ కృషి చేసి కలుపు నివారించాలి.
ఎరువులు : ఆఖరి దుక్కిలో నాలుగు టన్నుల పశు వుల ఎరువులను పొలంలో వేసి బాగా కలియ దున్నాలి. విత్తేటప్పుడు 20 కేజీల యూరియా, ఒక బస్తా(50 కేజీల) సింగిల్ సూపర్ ఫాస్పెట్ వేయాలి. విత్తిన నెల రోజులకు మరో 20 కేజీల యూరియాను పైపాటుగా వేయాలి.
కొర్ర పంటను ఆశించే వాటిలో గులాబీ రంగు పురుగు, కాండం తొలిచే పురుగు, చెదలు, మిడతలు, లద్దె పురుగు ముఖ్యమైనవి.
చెదల నివారణకు చివరి దుక్కిలో ఫాలిడాల్ రెండు శాతం పొడి మందును ఎకరాకు 10 నుంచి 12 కిలోల వంతున మట్టిలో బాగా కలిసేటట్లు వేయాలి.
మిడతల నివారణకు కార్బరిల్ 5 శాతం పాడి మందును ఎకరాకు 10 నుంచి 12 కిలోల చొప్పున చల్లాలి.
కిలో విత్తనానికి 3 గ్రాముల కాప్టాన్/ థైరామ్, మందుతో విత్తన శుద్ధి చేయడం ద్వారా తుప్పు, అగ్గి, వెర్రికంకి తెగుళ్లను కొంతవరకు అరికట్టవచ్చు.
పాడి–పంట


