హన్వాడ: ఆపదలో ఉన్నవారికి అండగా నిలిచి మానవత్వం చాటారు మండలంలోని కొనగట్‌పల్లి సర్పంచ్ కుర్మయ్య. గ్రామానికి చెందిన చిల్ల వెంకటయ్యకు కాలికి ప్రమాదవశాత్తు తీవ్ర గాయం కావడంతో అనారోగ్యానికి గురై సోమవారం మృతిచెందాడు. అయితే వెంకటయ్య పాడె మోసేందుకు కూడా ఎవరూ లేని పరిస్థితి నెలకొనడంతో సర్పంచ్ స్వయంగా పాడెమోసి అంతిమ యాత్రలో పాల్గొన్నారు. అలాగే వెంకటయ్య కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలిచేందుకు సర్పంచ్‌తోపాటు డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్, మాజీ సర్పంచ్ భర్త రమణారెడ్డి తదితరులు కలిసి రూ.45 వేలు ఆర్థిక సహాయాన్ని అందజేయడంతో గ్రామస్తులు అభినందించారు.


