జడ్చర్ల పత్తి మార్కెట్‌యార్డు ఒకప్పడు అన్ని వసతులతో కళకళలాడేది. నేడు యార్డును పట్టించుకునే వారే కరువయ్యారు. ఇక్కడ చెత్తచెదారం నిండిపోయి విషసర్పాలకు నిలయంగా మారింది. అధికారులు పట్టించుకొని సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి.
– శాంతయ్య, హమాలీ సంఘం అధ్యక్షుడు, జడ్చర్ల
మార్కెట్‌లో ఎన్నో సంవ త్సరాలుగా హమాలీ ప నులు చేస్తున్నాం. ఇక్కడి సివిల్ సప్లయ్ గోదాము లలో కూలీ పనులు చేస్తు న్నా. ఇక్కడ తాగేందుకు నీరు దొరకడం లేదు. మరుగుదొడ్లు కూడా లేవు. అధికారులు పట్టించుకోవడం లేదు.
–కృష్ణ, హమాలీ, జడ్చర్ల
●


