అంతర్గత రోడ్లు వేయాలి.. | - | Sakshi
Sakshi News home page

అంతర్గత రోడ్లు వేయాలి..

Jul 7 2026 1:01 AM | Updated on Jul 7 2026 1:01 AM

నగరంలోని 29వ డివిజన్‌ పరిధి హనుమాన్‌ పురలో సీసీ రోడ్లు ధ్వంసమై ప్రజల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. దీనికితోడు డ్రెయినేజీలను శుభ్రం చేయడం లేదు. మిషన్‌ భగీరథ పైప్‌లైన్లు లీకేజీలు అవుతున్నాయి. వెంటనే అధికారులు స్పందించి ఆయా సమస్యలను పరిష్కరించాలి.

ఎంఏ ఖాదర్‌, ప్రగతిశీల సమాజ్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు

భూమి కబ్జా చేశారు..

గర పరిధిలోని ఏనుగొండ గ్రామంలో సర్వే నం.81/2లో 3 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. మా భూమిలో ఇల్లు కట్టుకోవడానికి పూనుకుంటే కొంతమంది వ్యక్తులు రాజకీయ నాయకుల సహాయంతో అది మా స్థలమని బెదిరిస్తున్నారు. మాకు మా తాతల నుంచి సంక్రమించిన ఆస్తి ఇది. పట్టాదారు పాసుపుస్తకాలు కూడా మా పేర్లపై ఉన్నాయి. అధికారులు స్పందించి మా భూమిని మాకు ఇప్పించాలి.

– చింతకింది వెంకటయ్య, ఏనుగొండ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement