చిన్నచింతకుంట: అనుమానాస్పదంగా యువతి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని మృతి చెందిన ఘటన చి న్నచింతకుంట మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ ఓబుల్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నచింతకుంటకు చెందిన తేజశ్విని (19) ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. బుధవారం అర్ధరాత్రి కుటుంబ సభ్యు లు నిద్రిస్తుండగా ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకొ ని మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఉదయం ఘటన స్థలానికి చేరుకొని మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూ ర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.మృతురాలి తండ్రి కృష్ణయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ తెలిపారు.


