నర్వ: గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతిచెందిన ఘట న నర్వ మండలం రాంపూర్ గేట్ వద్ద బుధవారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్‌ఐ పబ్బ తి రమేశ్ వివరాల మేరకు.. చిత్తనూర్‌కు చెందిన బండ రాంరెడ్డి (50) తన బైక్‌లో పెట్రోల్ పోయించుకునేందు కు రాంపూర్ గేట్ సమీపంలో ఉన్న బంక్‌కు వెళ్తుండగా.. పత్తి మిల్లు వద్ద వేగంగా వచ్చిన గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికులు 108 అంబులెన్స్‌లో మరికల్‌కు, అటు నుంచి మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆయన మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి కుమారుడు హర్షవర్ధన్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.


