అదృశ్యమైన వ్యక్తి శవమై కనిపించాడు | - | Sakshi
Sakshi News home page

అదృశ్యమైన వ్యక్తి శవమై కనిపించాడు

Jun 12 2026 6:03 AM | Updated on Jun 12 2026 6:03 AM

కోడేరు: మండలకేంద్రంలో నాలుగు రోజుల క్రితం అదృశ్యమైన వ్యక్తి గురువారం ఎత్తం శివారులోని మాలవాగు సమీపంలో శవమై కనిపించాడు. ఎస్‌ఐ వేణుగోపాల్‌ వివరాల మేరకు.. కోడేరుకు వట్టెల రాములు (35) ఈ నెల 7న ఇంటి నుంచి తన ద్విచక్ర వాహనంపై సింగోటం వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో మాలవాగు సమీపంలో మూలమలుపు వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి చెట్లపొదల్లోకి వెళ్లిపోయింది. దీంతో రాములు మతిస్థిమితం లేకుండా పడిపోయాడు. అదే రోజు రాత్రి 8గంటల ప్రాంతంలో ఆయన సెల్‌ఫోన్‌ నుంచి తెలిసిన వారికి ఫోన్‌చేసి దాహం వేస్తుంది.. నీరు తేవాలని కోరాడు. అంతలోనే ఫోన్‌ స్విచాఫ్‌ కావడంతో కుటుంబీకులు ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. ఈ విషయంపై అతడి సోదరుడు రాంచంద్రయ్య కోడేరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. మిస్సింగ్‌ కేసు నమోదైంది. గురువారం అటుగా వెళ్తున్న వారు మాలవాగు వద్ద దుర్వాసన వస్తుందని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకొని చూడగా.. మిస్సింగ్‌ అయిన వ్యక్తి రాములు అని గుర్తించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించి విచారణ చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతుడి భార్య గతంలోనే చనిపోయింది. ప్రస్తుతం అతడు కూడా చనిపోవడంతో తన ఐదేళ్ల కూతురు అనాథగా మారింది. గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.

బుద్దారం గండిలో

మృతదేహం లభ్యం

గోపాల్‌పేట: అదృశ్యమైన వ్యక్తి శవమై కనిపించిన ఘటనలో మండలంలో గు రువారం చోటుచేసుకుంది.పోలీసులు, బాధిత కు టుంబ సభ్యుల వివరా ల మేరకు.. మండలంలోని ఏదుట్లకు చెందిన దొబ్బల శాంతయ్య (58) రెండు నెలల క్రితం కూలి పనులు చేసుకునేందుకు ఏపీలోని శ్రీకాకుళం వెళ్లాడు. మే 19న గ్రామానికి వచ్చినా.. ఇంటికి వెళ్లలేదు. విష యం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వెతికి నా ఆచూకీ లభించకపోవడంతో జూన్‌ 4న గో పాల్‌పేట పోలీస్‌స్టేషన్‌లో మిస్సింగ్‌ అయినట్లు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో గురువారం బుద్దారం గండి స మీపంలోని చెట్లల్లో కుళ్లిన స్థితి ఒక మృతదేహం ఉందని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ శశిధర్‌ సిబ్బంది తో కలిసి వెళ్లి మృతదేహన్ని పరిశీలించారు. ఏదుట్ల గ్రామానికి చెందిన వ్యక్తిగా అను మానించి కుటుంబ సభ్యులను పిలిపించి చూి పంచగా దొబ్బల శాంతయ్య అని నిర్దారించారు. మృతదేహానికి అక్కడే పోస్టుమార్టం నిర్వహించి,కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

డబ్బు ఇవ్వలేదని

బలవన్మరణం

పాన్‌గల్‌: ఉరి వేసుకొని వ్యక్తి బలవన్మరణానికి పా ల్పడిన ఘటన గురువారం మండలంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కదిరెపాడుకు చెందిన కాసాని వెంకటేష్‌ (32)కు మూడేళ్ల క్రితం భార్య పద్మతో విడాకులయింది. ఈ క్రమంలో మద్యానికి బానిసై అనారోగ్యానికి గురయ్యాడు. గురువారం మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వాలని తల్లిని కోరగా.. తన వద్ద డబ్బులు లేవని చెప్పడంతో తీవ్ర మనస్థాపానికి గురై గ్రామ శివారులోని కేఎల్‌ఐ కాల్వ పక్కన వ్యవసాయ పొలంలో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్‌ఐ కుర్మయ్య పేర్కొన్నాడు.

ఉత్తీర్ణత సాధించలేదని

ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య

మహబూబ్‌నగర్‌ క్రైం: ఇంటర్‌లో ఫెయిల్‌ కావడంతో ఓ విద్యార్థి ఆత్మహత్య కు పాల్పడిన సంఘటన మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో చోటు చేసు కుంది. వన్‌టౌన్‌ ఎస్‌ఐ శీనయ్య కథనం ప్రకారం.. నగరంలోని మదీ నా మజీద్‌ ఏరియాకు చెందిన హాబీబ్‌ ఉమేద్‌(18) నగరంలో ఓ కళాశాలలో ఇంటర్‌ ఎంపీసీ చదివాడు. ద్వితీయ సంవత్సరంలో రెండు సబ్జెక్టులు ఉత్తీర్ణత సాధించకపోవడంతో ఇటీవల మళ్లీ సప్లిమెంటరీ పరీక్షలు రాశాడు. కాగా గురువారం విడుదల చేసిన ఫలితాల్లో కూడా ఫెయిల్‌ కావడంతో తీవ్ర మనస్తానికి గురై ఉమేద్‌ మధ్యాహ్నం సమయంలో ఇంట్లో దుప్పటితో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే జనరల్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ సాయంత్రం మృతి చెందాడు. మృతుడి తండ్రి మక్సూద్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెల్లడించారు. మక్సూద్‌కు ఇద్దరు కూతుర్తెలతో పాటు కొడుకు హాబీబ్‌ ఉమేద్‌ ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement