పెట్రోల్‌ బంక్‌ యజమానిపై దాడి | - | Sakshi
Sakshi News home page

పెట్రోల్‌ బంక్‌ యజమానిపై దాడి

Jun 12 2026 6:03 AM | Updated on Jun 12 2026 6:03 AM

నగదు, బంగారు గొలుసు

లాక్కెళ్లిన నిందితుడు

పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు

దూరంలోనే ఘటన

అమరచింత: పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలో కొంతమంది నిందితులు పెట్రోల్‌ బంక్‌ యాజమానిపై దాడిచేసి రూ.2.50లక్షలు, రెండున్నర తులాల బంగారు గొలుసును దోచుకెళ్లిన ఘటన పట్టణంలో కళకళం రేపింది. అమరచింత పట్టణానికి చెందిన బిలకంటి రామ్మోహన్‌శెట్టి తన పెట్రోల్‌ బంక్‌ వద్ద బుధవారం రాత్రి వర్కర్స్‌ నుంచి కలెక్షన్‌కు సంబంధించి రూ.2.50లక్షల నగదును తీసుకుని కారులో ఇంటికి బయలుదేరాడు. రామ్మోహన్‌ శెట్టి ఇంటికి వస్తున్నాడనే సమాచారంతో అదే గ్రామానికి చెందిన డీసీ.రాజశేఖర్‌ తన తమ్ముళ్లను వెంటపెట్టుకుని కాపు కాశా డు. కారు ఇంటి వద్దకు రాగానే డీసీ రాజశేఖర్‌ రాడ్డు, కత్తితో అకస్మాత్తుగా రామ్మోహన్‌శెట్టిపై దాడి చేసి గాయపర్చాడు. బ్యాగ్‌లో ఉన్న రూ.2.5లక్షల నగదుతోపాటు రెండు తులాల బంగారు గొ లుసు ను లాకెళ్లాడని బాధితుడు రాత్రికిరాత్రే పోలీసులకు లిఖిత పూర్వక ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది. రామ్మోహన్‌శెట్టి ఇంటికి పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరమే ఉన్నా.. నిందితులు ఇ లా మారణాయుధాలతో దాడి చేయడం పట్టణంలో కళకళం రేపింది. ఈ ఘటనపై బాధితుడు రామ్మోహన్‌శెట్టి మాట్లాడుతూ.. రేషన్‌ బియ్యం కొనుగోలు చే యనని రాజశేఖర్‌కు తెలుపగా.. రేషన్‌ బియ్యం మీ రైస్‌మిల్లులో ఉంచి నీపై కేసు అయ్యేటట్లు చేస్తానని పలుమార్లు బెదిరించాడని తెలిపారు. ఇదే తరహాలో రాయచూరు, అమరచింత, ఆత్మకూర్‌, మదనాపురం, దేవరకద్ర, కొత్తకోటలోని రైస్‌మిల్‌ల యాజమానులపై బ్లాక్‌ మెయిల్‌ చేస్తూ తనను కూడా బ్లాక్‌ మె యిల్‌ చేశాడని ఆరోపించారు. తన రైస్‌మిల్‌లో రేషన్‌ బియ్యం దందా చేయనని పలుమార్లు చెప్పినా.. నిందితుడు రాజశేఖర్‌ దందా చేయకుంటే తనకు రూ. 5లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. డబ్బులు ఇవ్వ ని పక్షంలో పలుమార్లు తన ఇంటిపై రాత్రిపూ ట రా ళ్లు రువ్వి భయపెట్టినా పట్టించుకోకపోవడంతో ఇలా కత్తితో దాడిచేసినట్లు ఆరోపించారు. డీసీ రాజశేఖర్‌ నుంచి తనకు ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యా దు చేసినట్లు విలేకరులకు తెలిపారు.ఈ వ్యవహారంలో డీసీ రాజశేఖర్‌ పట్టణంలో రియల్‌ఎస్టేట్‌ వ్యాపా రి కాడ్గి గణేష్‌ ద్వారా తాము కొనుగో లు చేసిన ప్లాట్‌ల వ్యవహారంలో నష్టపోయామని తమకు రూ.36లక్షలు ఇవ్వాలని పలుమార్లు డీసీ రాజశేఖర్‌ తనను బెదిరించినట్లు పేర్కొన్నారు.ఈ వ్యవహారంపై పోలీసులను అడుగగా.. ఫిర్యాదు అందిందని విచారిస్తున్నామని ఎస్‌ఐ స్వాతి తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement