నీటితో కళకళలాడుతున్న సమాంతర కాల్వ
సాగునీరు లేక వెలవెలబోతున్న జూరాల ప్రధాన ఎడమ కాల్వ
ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నుంచి ప్రధాన ఎడమ కాల్వతో పాటు సమాంతర కాల్వలకు సాగునీటిని పూర్తిగా నిలిపివేసినట్లు అధికారులు ప్రకటించారు. ఈ మేరకు కాల్వల షట్టర్లను మూసివేశారు. అయితే సమాంతర కాల్వ ప్రధాన షట్టర్ లీకేజీ కారణంగా నీరు పారుతూ కళకళలాడుతోంది. మరోవైపు ప్రధాన ఎడమ కాల్వ మాత్రం నీరు లేక వెలవెలబోతోంది. అతి సమీపంలో ఉన్న రెండు కాల్వలను చూస్తున్న రైతులు ఎంత తేడా.. ఇది ఎంత తేడా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. – అమరచింత


