పాన్‌గల్: మండలంలోని మాందాపూర్‌లో ఐకేపీ ఆ ధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రం నుంచి పాత ధాన్యం లోడ్‌తో శ్రీరంగాపూర్ మండల కేంద్రంలోని రైసుమిల్లుకు తరలించగా.. మిల్లు యజమాని పరిశీలించి పాత వడ్లు ఉన్నట్లు గుర్తించి జిల్లా అధికారులకు సమాచారం ఇవ్వడంతో విచార ణకు ఆదేశించిన ఘటన గురువారం చోటుచేసుకుంది. తహసీల్దార్ కార్తీక్‌రావు, జిల్లా సివిల్ సప్లయ్ డీఎం ఆంజనేయులు, టెక్నికల్ అధికారులు మాందాపూర్‌లోని ఇషాన్ రైస్ మిల్లుకు చేరుకొని లారీలో లోడ్ చేసిన ధాన్యం, రైస్‌మిల్లులో నిల్వ ఉ న్న ధాన్యం ఒక్కటేనా అనే విషయాలను పరిశీలించి ధాన్యం శాంపిల్ తీసుకొని విచారణ చేస్తున్నామ ని పూర్తి నివేదికను జిల్లా అధికారులకు నివేదిస్తామ ని అధికారులు పేర్కొన్నారు. వాస్తవానికి మాందాపూ ర్ నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని మండలంలో ని కేతేపల్లి రైస్‌మిల్లు, లేకుంటే గద్వాల రైస్‌మిల్లు కు పంపాల్సి ఉండగా శ్రీరంగాపూర్ రైస్ మిల్లుకు పంపడంపై పలు అనుమానాలకు తావిచ్చింది. ట్రక్ షీట్‌లో ధాన్యం కొనుగోలు చేసే కమి టీ సభ్యుల సంతకాలు లేకుండా పంపించడం కూ డా అనుమానాలకు తెరలేపింది.ఐకేపీ కొనుగోలు కేంద్రాల నుంచి సేకరించే ధాన్యంపై ఐకేపీ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతోనే అక్రమాలకు పాల్పడుతున్నారని పలువురు రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
గుర్తించిన మిల్లు యజమాని,
జిల్లా అధికారులకు సమాచారం
విచారణ చేపట్టాలని
తహసీల్దార్‌కు ఆదేశం
మిల్లును సందర్శించిన రెవెన్యూ,
సివిల్ సప్లయి అధికారులు


