హాకీ చాంపియన్ రంగారెడ్డి
● రన్నరప్‌గా నిలిచిన మహబూబ్‌నగర్ జిల్లా జట్టు
● అట్టహాసంగా అండర్–19 పోటీలు
హుడాకాంప్లెక్స్: మానసిక ఉల్లాసానికి, శారీరక దృఢత్వానికి క్రీడలు దోహదం చేస్తాయని తెలంగాణ హాకీ అసోసియేషన్ అధ్యక్షుడు కొండా విజయ్‌కుమార్ అన్నారు. స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో స్టేట్ లెవల్ 69వ అండర్–19 హాకీ పోటీలు ఆదివారం సరూర్‌నగర్‌లోని విక్టోరియా మెమోరియల్ హోం గ్రౌండ్‌లో అట్టహాసంగా నిర్వహించారు. రాష్ట్రంలోని ఉమ్మడి పది జిల్లాల నుంచి 200 మంది క్రీడాకారులు హాజరయ్యారు. పోటీల్లో రంగారెడ్డి జిల్లా విన్నర్ కాగా మహబూబ్‌గర్ రన్నరప్‌గా నిలిచింది. విజేతలకు విజయ్‌కుమార్ బహుమతులు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యువత క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఉద్యోగాల్లో రిజర్వేషన్‌తోపాటు ప్రభుత్వ ప్రోత్సాహకాలు లభిస్తాయని చెప్పారు. స్టేట్ లెవల్‌లో గెలుపొందిన క్రీడాకారులకు మార్చిలో గచ్చిబౌలిలో జరిగే అంతర్జాతీయ క్రీడా పోటీలను వీక్షించేందుకు అవకాశం కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా హాకీ అసోసియేషన్ కార్యదర్శి భాస్కర్‌రెడ్డి, కృష్ణమూర్తిగౌడ్, హోం సెక్రటరీ రామారావు, లక్ష్మీపార్వతి తదితరులు పాల్గొన్నారు.


