నేటినుంచి జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: జిల్లాకేంద్రంలోని ఫాతిమా విద్యాలయంలో సోమవారం నుంచి జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆదివారం ఏర్పాట్లను డీఈఓ ప్రవీణ్‌కుమార్ ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రదర్శనలో సుస్థిర వ్యవసాయం, వ్యర్థాల నిర్వహణ, ప్రత్యామ్నాయ ప్లాస్టిక్, హరిత శక్తి, అభివృద్ధి చెందుతున్న సాంకేతికత, వినోదపరమైన గణిత నమూనాలు, పరిశుభ్రత, నీటి సంరక్షణ నిర్వహణ తదితర అంశాలపై సైన్స్ ప్రదర్శనలు చేయనున్నారు. ఈ మేరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొంటారని, ప్రతి పాఠశాల నుంచి కనీసం రెండు ప్రదర్శనలు తప్పకుండా పాల్గొనాలని సూచించారు. ఇక్కడ ఎంపికై న ప్రదర్శనలు ఈ నెల 7, 8, 9 తేదీల్లో కామారెడ్డిలో నిర్వహించే రాష్ట్రస్థాయి ప్రదర్శనల్లో పాల్గొనాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఒకే రోజు ప్రదర్శనలు, ఎంపికలు ఉన్నందున నిర్ణీత సమయానికి ఉపాధ్యాయులు సైన్స్‌ఫేర్ వద్దకు చేరుకోవాలని కోరారు.


