రేపు ఉమ్మడి జిల్లా ఖోఖో ఎంపికలు
మహబూబ్‌నగర్ క్రీడలు: నారాయణపేటలోని మినీ స్టేడియంలో మంగళవారం ఉమ్మడి జిల్లా ఖోఖో సబ్ జూనియర్ బాల, బాలికల జట్ల ఎంపికలు నిర్వహించనున్నట్లు ఉమ్మడి జిల్లా ఖోఖో సంఘం ప్రధాన కార్యదర్శి జీఏ విలియం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. నారాయణపేటలో ఈ నెల 18 నుంచి 20 వరకు రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ ఖోఖో పోటీలు జరుగుతాయన్నారు. ఉమ్మడి జిల్లా క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎంపికల్లో పాల్గొనేవారు ఒరిజినల్ ఆధార్‌తో హాజరుకావాలని, పూర్తి వివరాల కోసం వ్యాయామ ఉపాధ్యాయులు నర్సింహులు (99488 66747), వెంకటేశ్ (86390 91977), పీడీలు బాలరాజు (93933 88439), సాయినాథ్‌రెడ్డి (95026 16352), చక్రవర్తి (80746 22253)లను సంప్రదించాలని సూచించారు.
విద్యుత్ ఆర్టిజన్స్‌ను
రెగ్యులర్ చేయాలి
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): విద్యుత్ శాఖలో పని చేస్తున్న ఆర్టిజన్స్ కార్మికులను వెంటనే రెగ్యులర్ చేయాలని టీజీఎస్పీడీసీఎల్ కంపెనీ ఆర్గనైజింగ్ సెక్రటరీ వెంకట్ ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఆర్టిజన్స్ డిమాండ్ల సాధన కోసం ‘చలో మహబూబ్‌నగర్’ నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా సోమవారం జిల్లాకేంద్రంలోని ఏనుగొండ జేజేఆర్ ఫంక్షన్ హాల్‌లో మధ్యాహ్నం ఒంటిగంటకు సభ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ సమావేశానికి ఉమ్మడి జిల్లా నుంచి విద్యుత్ శాఖ ఆర్టిజన్ కార్మికులు, నాయకులు పెద్దసంఖ్యలో హాజరుకావాలని కోరారు.
కోయిల్‌సాగర్ నీటిని
వినియోగించుకోండి
దేవరకద్ర: కోయిల్‌సాగర్ నీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి అన్నారు. ఆదివారం ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల ద్వారా యాసంగి పంటలకు నీటిని వదిలిన అనంతరం ఆయన మాట్లాడారు. రైతులకు ఇబ్బంది లేకుండా పంటలు వేసుకునే అనువైన సమయంలోనే నీటిని వదులుతున్నామన్నారు. ప్రాజెక్టులో ఉన్న నీటిని యాసంగి పంటలకు అందించాలని ఇటీవల జిల్లాస్థాయిలో జరిగిన సాగునీటి సలహా మండలి సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. రైతులు నీటి వృథాను అరికట్టి కిందిస్థాయిలో ఉండే రైతులకు నీటిని వదలాలని సూచించారు.
కాంగ్రెస్ హయాంలోనే రూపకల్పన
పాలమూరు పథకానికి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే రూపకల్పన చేయడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు. 2013లో జూరాల సోర్స్‌గా పాలమూరు ప్రాజెక్టు నిర్మించాలని ఉమ్మడి రాష్ట్రంలోనే నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. జూరాల నుంచి సోర్స్ అయితే రోజుకు 2.8 టీఎంసీల నీటిని తరలించే అవకాశం ఉండేదని, జూరాల నుంచి అయితే 60 రోజుల్లో 121 టీఎంసీల నీటిని తీసుకునే వాళ్లమన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చాక నీటి సోర్స్‌ను జూరాల నుంచి శ్రీశైలానికి మార్చడం వల్ల 68 టీఎంసీలకు పడిపోయిందని, కమీషన్ల కోసమే ప్లేస్‌ను మార్చారని ఆరోపించారు. కార్యక్రమంలో టీపీసీసీ ఆర్గనైజింగ్ కార్యదర్శి అరవింద్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు అంజిల్‌రెడ్డి, సర్పంచ్‌లు సందప్ప, ఉసేనప్ప, రాజుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.


