కలెక్టర్ చొరవ.. ప్రధాని ప్రశంసలు
నారాయణపేట: నారాయణపేట జిల్లాకేంద్రంలో నిరాదరణకు గురైన బారంబావి.. కలెక్టర్ హరిచందన చొరవతో భావితరాలకు అందుబాటులోకి వచ్చింది. ముళ్లపొదలు, చెత్తాదారం పేరుకుపోయి దుర్గంధభరితంగా మారిన బారంబావిని చూసిన 2021లో అప్పటి కలెక్టర్ దాసరి హరిచందన ఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో పునరుద్ధరించి ఇటు ప్రజల మన్ననలతోపాటు మన్‌కీబాత్‌లో ప్రధాని నరేంద్రమోదీచే ప్రశంసలు అందుకుంది. అలాగే 2021 నుంచి అక్కడే బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. బావి చుట్టూ విద్యుద్దీపాలు అలంకరించడంతో దేదీప్యమానంగా వెలుగొందుతోంది. బారంబావి పునరుద్ధరణకు చొరవ తీసుకున్న అప్పటి కలెక్టర్ దాసరి హరిచందన, ముందుకు వచ్చిన స్వచ్ఛంద సంస్థను ప్రధాని ప్రత్యేకంగా ప్రశంసించారు. చారిత్రకమైన మెట్లబావి పునరుద్ధరణపై స్థానిక ప్రజలు ఇప్పటికీ గుర్తుచేసుకుంటారు.
కలెక్టర్ చొరవ.. ప్రధాని ప్రశంసలు


