సొమ్మును జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి : ఎస్పీ
మహబూబ్‌నగర్ క్రైం: సంక్రాంతి పండగ నేపథ్యంలో పాఠశాలలకు సెలవులు ఇచ్చిన తర్వాత నగరంలో నుంచి భారీగా స్వగ్రామాలకు వెళ్తుంటారని ఈ క్రమంలో అవసరం జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ డి.జానకి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటికి తాళాలు వేసి వెళ్లే సందర్భాల్లో దొంగతనాలు జరిగే అవకాశం ఉన్నందున ప్రత్యేక జాగ్రత్తలు అవసరం అన్నారు. ఇంట్లో ఉండే విలువైన బంగారం, వెండి, డబ్బులు, ఇతర ముఖ్యమైన పత్రాలను బ్యాంక్ లాకర్ లేదా విశ్వసనీయమైన వ్యక్తుల దగ్గర భద్రపరచాలని సూచించారు. ఇంట్లో ఎవరూ లేరని గుర్తించకుండా టైమర్ లైట్లు లేదా రాత్రివేళ లైట్లు వెలిగి ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రధానంగా సీసీ కెమెరాలు, అలారం సిస్టమ్స్ ఏర్పాటు చేసుకోవడం వల్ల భద్రత మరింత పెరుగుతుందన్నారు. సోషల్ మీడియాలో ఊరికి వెళ్లాం.. ఇంటి వద్ద లేను వంటి సమాచారం షేర్ చేయరాదన్నారు. అద్దె ఇళ్లలో ఉండేవాళ్లు మరింత జాగ్రత్తలు తీసుకుంటూ అపార్ట్‌మెంట్‌లు అయితే తప్పక వాచ్‌మెన్‌లను అప్రమత్తం చేయాలన్నారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా దొంగల ముఠాలు కనిపిస్తే వెంటనే డయల్ 100 లేదా 112 పోలీస్ కంట్రోల్ రూం నం.87126 59360కు సమాచారం ఇవ్వాలని కోరారు.
నేడు కోయిల్‌సాగర్
నీటి విడుదల
దేవరకద్ర: యాసంగి పంటల సాగుకు గాను కోయిల్‌సాగర్ ప్రాజెక్టు నుంచి ఆదివారం నీటిని విడుదల చేస్తున్నారు. గతంలో అధికారికంగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం 5 తడులు విడుదల చేయడానికి నీటి పారుదల శాఖ అధికారులు సిద్ధమయ్యారు. ఒక్కో తడి కింద 10 రోజులపాటు నీటిని విడుదల చేసి మధ్యలో విరామం ఇస్తారు. యాసంగి సీజన్‌లో భాగంగా ప్రాజెక్టు పాత ఆయకట్టు కింద ఉన్న 12 వేల ఎకరాల వరకు సాగునీరు అందిస్తారు. కుడి కాల్వ కింద 8 వేలు, ఎడమ కాల్వ కింద 4 వేల ఎకరాల మేర నీటిని అందించే అవకాశం ఉంది. ఈ క్రమంలో మొదటి తడి ఆదివారం విడుదల చేస్తారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 32.2 అడుగుల వద్ద 2 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఉన్న రెండు టీఎంసీల నీటిలో ఒక టీఎంసీ సాగునీటికి.. మరో టీఎంసీని వేసవిలో తాగునీటికి వినియోగిస్తారు. ఈ మేరకు ఆదివారం ఉదయం 10.30 గంటలకు ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి కోయిల్‌సాగర్ నీటిని విడుదల చేస్తారని కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు అంజిల్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
‘టెట్’కు
306 మంది హాజరు
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: జిల్లాలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష శనివారం ప్రారంభమయ్యాయి. ఈ మేరకు ప్రభుత్వం రెండు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా మొదటి రోజు కేవలం ఒక్క ఫాతిమా విద్యాలయ కేంద్రంలో మాత్రమే పరీక్ష నిర్వహించారు. ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 4.30 గంటల వరకు రెండు సెషన్లలో పరీక్ష జరిగింది. మొదటి రోజు పలువురు అభ్యర్థులు ఉదయం 7.30 గంటలకే పరీక్ష కేంద్రం వద్దకు చేరుకున్నారు. మొత్తం 360 మంది అభ్యర్థులకు గాను 306 మంది హాజరవగా.. 27 మంది గైర్హాజరయ్యారు.
ఆర్‌ఎన్‌ఆర్ క్వింటాల్ రూ.2,749
జడ్చర్ల: బాదేపల్లిలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో శనివారం ధాన్యం ఆర్‌ఎన్‌ఆర్ క్వింటాల్ గరిష్టంగా రూ.2,749, కనిష్టంగా రూ.2,289 ధరలు లభించాయి. అలాగే హంస రూ.1,811, కందులు గరిష్టంగా రూ.6,810, కనిష్టంగా రూ.5,610, వేరుశనగ గరిష్టంగా రూ.8,791, కనిష్టంగా రూ.6,269, మినుములు రూ.7,881, మొక్కజొన్న గరిష్టంగా రూ.1,971, కనిష్టంగా రూ.1,856, పత్తి గరిష్టంగా రూ.7,129, కనిష్టంగా రూ.4,500, ఉలువలు రూ.3,900 చొప్పున వచ్చాయి.
● వామ్మో రక్తపింజర
● తల్లి మందలించిందని యువతి ఆత్మహత్యాయత్నం
● రూ.17 లక్షల పత్తి విత్తనాలు చోరీ
● విద్యార్థిని బలవన్మరణం
సొమ్మును జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి : ఎస్పీ


