వేరుశనగ.. సంరక్షణ ఇలా..
అలంపూర్: యాసంగి మొదలవడంతో నీటి వసతి ఉన్న రైతులు ఈ ఏడాది వేరుశనగ సాగు చేపట్టారు. డిమాండ్, అధిక లాభా లు వస్తాయన్న ఆశతో వేరుశనగ సాగుపై దృష్టి పెట్టారు. అయితే ఈ పంటలో జింకు, ఇనుము దాతువు లోపాలతో దిగుబడి తగ్గే అవ కాశం ఉందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సక్రియ నాయక్ పేర్కొంటున్నారు. పంటలో జింకు, ఇనుప ధాతువు లోప నివారణకు కింది జాగ్రత్తలు తీసుకుంటే ఫలితం ఉంటుందని సూచిస్తున్నారు.
జింకు లోపానికి కారణాలు: భాస్వరం ఎరువుల వాడకం ఎక్కువగా ఉన్నప్పుడు.
ఉదజని సూచిక 7.0 దాటినప్పుడు.
భూమిలో మెగ్నిషీయం అధిక మోతాదులో ఉన్నప్పుడు పంటలో జింకు లోపం ఏర్పడుతుంది.
జింకు లోప లక్షణాలు : ఆకులపై గోధమ రంగు మచ్చలు ఏర్పడి ఆకులు, కొమ్మలు చిన్నవిగా మారుతాయి.
నివారణ: జింకు లోప నివారణకు ఎకరానికి 20 కిలోల జింకు సల్ఫేట్ ప్రతి మూడు పంటలకు ఒకసారి భూమిలో కలపాలి.
పంట దశలో లోపం కనిపిస్తే చీలేటెడ్ జింక్ 2 గ్రాములు లీటరు నీటిలో కలిపి వారం రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేస్తే పంటకు ఉపయోగకరంగా ఉంటుంది.
ఇనుము ధాతువు లోపం : ఇనుము లోపం కనిపించినప్పుడు ఆకులు ఈనెలు పచ్చగా ఉండి మిగిలిన భాగాలు పసుపు రంగులోకి మారుతాయి. దీని వలన కిరణజన్య సంయోగ క్రియ సరిగ్గా జరగదు.
నివారణ : ఫెర్రస్ సల్ఫేట్ లేదా అన్న భేడి 2 గ్రాములు, నిమ్మ, ఉప్పు 1 గ్రాము, యూరియా 10 గ్రాములు లీటరు నీటిలో కలిపి 10 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేస్తే ఇనుప ధాతువు నివారించవచ్చని పేర్కంటున్నారు.
పాడి–పంట
వేరుశనగ.. సంరక్షణ ఇలా..
వేరుశనగ.. సంరక్షణ ఇలా..


