భారీగా గుట్కా ప్యాకెట్ల పట్టివేత
నారాయణపేట: జిల్లా కేంద్రంలో మణికంఠ శెట్టి అనే వ్యక్తి ఇంట్లో ప్రభుత్వ నిషేధిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు టౌన్ ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. ముందస్తు సమాచారం మేరకు శుక్రవారం తనిఖీలు చేపట్టగా దాదాపు రూ. 2,05,025 విలువ గల గుట్కా ప్యాకెట్లు లభించాయన్నారు. గుట్కా ప్యాకెట్లను సీజ్ చేసి మణికంఠ శెట్టిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నారాయణపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరైనా గుట్కా ప్యాకెట్లను నిల్వ ఉంచినా, అమ్మినా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ హెచ్చరించారు.
మద్దిమడుగు
హుండీ లెక్కింపు
అమ్రాబాద్: పదర మండలం మద్దిమడుగు పబ్బతి ఆంజనేయస్వామి ఆలయ హుండీని శుక్రవారం అధికారులు భక్తుల సమక్షంలో లెక్కించారు. 40 రోజులకుగాను రూ.31,26,413 నగదు, మిశ్రమ వెండి 770 గ్రాములు వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. మొత్తాన్ని అమ్రాబాద్ ఎస్‌బీఐలో భద్రపర్చారు. హుండీ లెక్కింపులో దేవాదాయ, ధర్మాదాయ ఇన్‌స్పెక్టర్ మదన్‌కుమార్, ఈఓ రంగాచారి, ఆలయ కమిటీ మాజీ చైర్మన్ రాములునాయక్, మాజీ పాలకమండలి సభ్యులు, ఆలయ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.
భారీగా గుట్కా ప్యాకెట్ల పట్టివేత


