మట్టి రహిత సేద్యం
సింగారం ద్వారక స్కూల్ విద్యార్థులు వైష్ణవి, అనూష మట్టి లేకుండా వ్యవసాయం చేసే విధానాన్ని ప్రదర్శించారు. నీరు, నత్రజని, జలచరాలను ఉపయోగించి ఈ రకమైన వ్యవసాయం చేయవచ్చని చూపించారు. కృత్రిమంగా ఏర్పాటు చేసిన కొలనులో చేపలను పెంచి వాటి ద్వారా వచ్చిన నీటి వ్యర్థాలను శుద్ధి చేసి అదే నీటిని వర్టికల్ ఫార్మింగ్ (నిలువుగా వ్యవసాయం చేయడం)కు సరఫరా చేయాలి. రాబోయే రోజుల్లో పెద్ద పెద్ద అపార్ట్‌మెంట్‌లలో ఇలాంటి సేద్యం ద్వారా వ్యవసాయ ఉత్పత్తి పెంచవచ్చు.
సేంద్రియ సుస్థిర వ్యవసాయం
ధన్వాడ జెడ్పీ బాలుర పాఠశాల విద్యార్థులు రాజేందర్, ప్రవీణ్ రసాయన పదార్థాలు వాడకుండా సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేసే విధానంపై ప్రాజెక్టును రూపొందించారు. జీవామృతం పంటలకు ఉపయోగించడం, అంతర పంటలు వేయడం, పంట మార్పిడితో మనిషి ఆరోగ్యంతోపాటు, పంట దిగుబడి పెంచుకోవచ్చు.
మట్టి రహిత సేద్యం


