ప్రమాదాల కట్టడికి పటిష్ట చర్యలు
మహబూబ్‌నగర్ క్రైం: జిల్లాలో రోడ్డు ప్రమాదాలను నివారించడంతోపాటు వాహనదారుల్లో ట్రాఫిక్ నిబంధనలపై విస్తృతంగా అవగాహన కలిగించాలని ఎస్పీ డి.జానకి అన్నారు. రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఎస్పీ కార్యాలయంలో కరపత్రాలను ఆవిష్కరించారు. ద్విచక్ర వాహనదారు లు తప్పకుండా హెల్మెట్ ధరించడంతోపాటు వాహనానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అందుబాటులో ఉంచుకోవాలని, కారు డ్రైవర్లు సైతం సీటు బెల్ట్ తప్పక పెట్టుకోవాలని సూ చించారు. మద్యం తాగి వాహనాలు నడపడం వల్లే ప్రమాదాలు పెరుగుతున్నాయని తెలిపారు. అనంతరం బైపాస్ రోడ్డు మార్గంలో త రచూ ప్రమాదాలు జరుగుతున్న హాట్‌స్పాట్‌ల ను ఎస్పీ పరిశీలించారు. బైపాస్ రోడ్డు మధ్య లో డివైండర్లు అక్రమంగా తొలగించి రాంగ్‌రూట్‌లో వెళ్తున్నారని ప్రధానంగా బైక్ వాహనదారులు ఇలా చేస్తున్నట్లు గుర్తించి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
కందులు క్వింటా రూ.6,612
దేవరకద్ర: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో శుక్రవారం జరిగిన టెండర్లలో కందులు క్వింటాల్ గరిష్టంగా రూ.6,612, కనిష్టంగా రూ.5,950 ధరలు లభించాయి. సీజన్ తగ్గడంతో వరి ధాన్యం అమ్మకానికి రాలేదు. కేవ లం కందులు మాత్రమే అమ్మకానికి వచ్చాయి.
జిల్లాస్థాయి సైన్స్‌ఫేర్‌ను విజయవంతం చేద్దాం
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: ఈ నెల 5న నిర్వహించే జిల్లాస్థాయి సైన్స్‌ఫేర్‌ను విజయవంతం చేద్దామని డీఈఓ ప్రవీణ్‌కుమార్ అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని ఫాతిమా విద్యాలయంలో వివిధ కమిటీల సభ్యులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థుల ప్రదర్శన కోసం ఏర్పాటు చేసిన పలు కమిటీలు పూర్తిస్థాయిలో పనిచేయాలని, సమన్వయంతో ఏర్పాట్లను పర్యవేక్షించాలని సూచించారు. ఎన్సీఆర్టీఈ నిబంధనల ప్రకారం ప్రదర్శనలో జిల్లాస్థాయి బాల వైజ్ఞానిక, ఇన్‌స్పైర్ ప్రదర్శనలు ఉంటాయని, ఇందులో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొంటారన్నారు. సైన్స్‌ఫెయిర్‌లో పాల్గొనే విద్యార్థులు కొత్త ప్రయోగాలతో రావాలని ఆకాంక్షించారు. గతేడాది నిర్వహించిన రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్‌తో జిల్లాకు మంచి పేరు వచ్చిందని గుర్తుచేశారు. ఉదయం 8 గంటల నుంచి 5 గంటల వరకు సైన్స్ ఫెయిర్ ఉంటుందని చెప్పారు. సమావేశంలో జిల్లా సైన్స్ అధికారి షంషీర్‌అహ్మద్, సీఎంఓ సుధాకర్‌రెడ్డి, ఏఎంఓ శ్రీనివాస్, ఎంఈఓ లక్ష్మణ్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.
జోనల్ కిక్‌బాక్సింగ్ పోటీల్లో కాంస్య పతకం
మహబూబ్‌నగర్ క్రీడలు: మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్‌లో గత నెల 25 నుంచి 28వ తేదీ వరకు జరిగిన జోనల్ కిక్‌బాక్సింగ్ పోటీల్లో జిల్లా క్రీడాకారిణి తన్షిత ప్రతిభ కనబరిచినట్లు స్పోర్ట్స్ కిక్‌బాక్సింగ్ అసోసియేషన్ ఆఫ్ మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షుడు రవికుమార్ తెలిపారు. ఈ పోటీల్లో తన్షిత–37 కేటగిరిలో పాయింట్ ఫైట్‌లో కాంస్య పతకం సాధించినట్లు వివరించారు. ఈ మేరకు శుక్రవారం తన్షితను డీఎస్పీ వెంకటేశ్వర్లు అభినందించి సన్మానించారు. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మాస్టర్ రవికుమార్, సలహాదారులు విజయ్‌కుమార్ పాల్గొన్నారు.
ప్రమాదాల కట్టడికి పటిష్ట చర్యలు
ప్రమాదాల కట్టడికి పటిష్ట చర్యలు


