సోత్‌జోన్ పోటీలకు బయలుదేరిన పీయూ జట్టు
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సౌత్‌జోన్, ఆల్ ఇండియ టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు పీయూ షటిల్ బ్యాట్మింటన్ జట్టు గురువారం బయలుదేరింది. ఆంధ్రప్రదేశ్‌లోని క్లీఫ్ డీమ్డ్ యూనివర్సిటీలో ఈనెల 3వ నుంచి 6వ తేదీ వరకు పోటీలు జరగనుండగా పీయూ జట్టు బయలుదేరి వెళ్లింది. ఈ సందర్భంగా పోటీల్లో పాల్గొనే విద్యార్థులకు, కోచ్‌లకు వీసీ శ్రీనివాస్ క్రీడా దుస్తులను అందజేశారు. విద్యార్థులు ప్రతిభ కనబర్చి బంగారు పతకం సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పీడీ శ్రీనివాస్, కోచ్ అరుణ్, సత్యభాస్కర్‌రెడ్డి, రజిని, యుగంధర్ తదితరులు పాల్గొన్నారు.


