డ్రంకన్ డ్రైవ్‌లో 86 మంది పట్టివేత
మహబూబ్‌నగర్ క్రైం: నూతన సంవత్సర వేడుల నేపథ్యంలో బుధవారం రాత్రి జిల్లావ్యాప్తంగా పోలీసులు డ్రంకన్‌డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. నగరంలో మొత్తం ఐదు బృందాలతో పాటు జడ్చర్లలో ప్రత్యేకంగా బృందాలు ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టారు. అన్ని పోలీస్‌స్టేషన్ల పరిధిలో 86 మంది వాహనదారులు మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసి పాయింట్స్‌ను అర్ధరాత్రి తర్వాత ఎస్పీ డి.జానకి పరిశీలించారు. మహబూబ్‌నగర్ ట్రాఫిక్ పోలీసులు 26 కేసులు, టూటౌన్ 8, జడ్చర్లలో 10, కోయిలకొండలో 8, నవాబ్‌పేటలో 7 కేసులు నమోదు చేశారు.
రూ.279.29 కోట్ల మద్యం అమ్మకాలు
తిమ్మాజిపేట: మండల కేంద్రంలోని మద్యం డిపో నుంచి డిసెంబర్‌లో రూ. 279.29 కోట్ల విలువైన మద్యం సరఫరా చేసినట్లు డిపో అధికారులు గురువారం తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని తిమ్మాజిపేట టీజీఎస్‌బీసీఎల్ స్టాక్ పాయింట్ పరిధిలో 158 వైన్స్, 25 బార్లకు మద్యం సరఫరా చేస్తున్నారు. గత నెలలో పంచాయతీ ఎన్నికలు జరగడంతో మద్యం అమ్మకాలు జోరుగా సాగాయి. ఒక్క నెలలోనే రూ. 279.29 కోట్ల విలువైన 2.70.400 ఐఎంఎల్ (లిక్కర్) కాటన్లు, 2.29.400 బీర్ల కేసులను తిమ్మాజిపేట డిపో నుంచి సరఫరా చేశారు. సాధారణంగా స్టాక్ పాయింట్ నుంచి ప్రతినెలా రూ. 150కోట్ల విలువైన మద్యం సరఫరా చేస్తారు. పంచాయతీ ఎన్నికలు రావడంతో అమ్మకాలు పెరిగినట్లు అధికారులు తెలిపారు. కాగా, డిసెంబర్ 31న రూ. 10కోట్లకు పైగా అమ్మకాలు జరిగాయని పేర్కొన్నారు.
ఆధునిక నగరంగా తీర్చిదిద్దుతాం: ఎమ్మెల్యే
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: జిల్లా కేంద్రాన్ని ఆధునిక నగరంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గురువారం రాత్రి స్థానిక తెలంగాణచౌరస్తాలో హైమాస్ట్ లైట్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో మౌలిక వసతుల కోసం నిధుల కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ముఖ్యంగా రహదారులు, డ్రెయినేజీ, తాగునీరు, వీధి దీపాలు వంటి ప్రాథమిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ముడా చైర్మన్ కె.లక్ష్మణ్‌యాదవ్, జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం పర్సన్ ఇన్‌చార్జ్ గోనెల శ్రీనివాసులు, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్‌ఖాద్రీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు రాములుయాదవ్, అజ్మత్‌అలీ, ఖాజాపాషా, రాషెద్‌ఖాన్, అంజద్‌అలీ, ప్రశాంత్, షేక్‌ఉమర్‌పాషా తదితరులు పాల్గొన్నారు.
డ్రంకన్ డ్రైవ్‌లో 86 మంది పట్టివేత


