జిల్లా అభివృద్ధిలో భాగస్వాములవుదాం
● అడిషనల్ కలెక్టర్ మధుసూదన్‌నాయక్
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): నూతనోత్సవంతో ప్రభుత్వ అధికారులందరం కలిసికట్టుగా జిల్లా అభివృద్ధికి పాటు పడుదామని అడిషనల్ కలెక్టర్ మధుసూదన్‌నాయక్ అన్నారు. గురువారం నాలుగో తరగతి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యంగా జిల్లాను అన్ని రంగాల్లో ముందు వరుసలో ఉంచేందుకు సంపూర్ణ సహకారం అందించాలన్నారు. ప్రభుత్వ పాలనలో కిందిస్థాయి ఉద్యోగుల పాత్ర కీలకమని వారు నిబద్ధతతో పని చేయాలన్నారు.
హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలి
ద్విచక్ర వాహనాలు నడిపే ప్రతి ఒక్కరు కచ్చితంగా హెల్మెట్ ధరించాలని అదనపు కలెక్టర్ మధుసూదన్‌నాయక్ అన్నారు. రోడ్డు భద్రతా కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ సిబ్బందికి హెల్మెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల వల్ల ఏదైనా జరిగితే కుటుంబాలకు తీరని నష్టం వాటిల్లుతుందన్నారు. ఓ ప్రమాదంలో తన సొంత కుటుంబ సభ్యుడిని కోల్పోయానని, అలాంటి పరిస్థితి ఇంకొకరికి రావద్దని అన్నారు. ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించి, హెల్మెట్ ధరించి, సురక్షితంగా ప్రయాణించాలన్నారు. ఈ రోడ్డు భద్రత కారక్రమంలో తాను కూడా తన వంతు బాధ్యతగా తన సొంత డబ్బులతో జిల్లా కలెక్టరేట్ సిబ్బందికి హెల్మెట్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. కలెక్టరేట్ సిబ్బంది ప్రజలకు ఆదర్శంగా నిలవాలని, హెల్మెట్ వినియోగంపై అవగాహన కలిగించాలని కోరారు. కార్యక్రమంలో ఆర్‌డీఓ నవీన్, తదితరులు పాల్గొన్నారు.


