కొత్త ఏడాదిలో పారదర్శకమైన సేవలు అందించాలి
మహబూబ్‌నగర్ క్రైం: గతేడాదిలో ఎదుర్కొన్న సవాళ్లను, సాధించిన విజయాలను గుర్తు చేసుకుని నూతన ఏడాదిలో పోలీస్ అధికారులు మరింత క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని ఎస్పీ డి.జానకి సూచించారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో గురువారం నూతన సంవత్సరం సందర్భంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ కేక్‌కట్ చేయడంతో పాటు పోలీస్ అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. పారదర్శకమైన సేవలు అందించడం పోలీస్‌శాఖ ప్రధాన లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా విధులు నిర్వహించాలన్నారు. ఏఎస్పీలు ఎన్‌బీ రత్నం, సురేష్‌కుమార్, డీఎస్పీలు వెంకటేశ్వర్లు, రమణారెడ్డి, గిరిబాబు, సీఐలు పాల్గొన్నారు.
● కాగా.. ఎస్పీ డి.జానకికి సెలక్షన్ గ్రేడ్ కింద పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.


