ఉన్నత లక్ష్యాలతో ముందుకు..
జీవితంలో ఉన్నతంగా ఎదగాలని
జీవితంలో ఉన్నతంగా ఎదగాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నా. గతేడాది చేసిన తప్పిదాలు పునరావృతం కానివ్వను. కొత్త ఏడాది సరికొత్త ఆలోచనలతో మార్పు తీసుకురావాలని అనుకుంటున్నా. భవిష్యత్‌లో క్లాట్–2026 పరీక్షను క్రాక్ చేసేందుకు కృషి చేస్తా.. చదువుకునేందుకే ఎక్కువ సమయం కేటాయిస్తా.
– మేఘన, ఎంపీసీ మొదటి సంవత్సరం
సరికొత్త ఆలోచనలతోముందుకు..
కొత్త సంవత్సరంలో సరికొత్త ఆలోచనలతో ముందుకెళ్తా. కుటుంబసభ్యులు, స్నేహితుల తో సంతోషంగా గడపాలని కోరుకుంటున్నా. చదువుకే అధిక ప్రాధా న్యత ఇస్తా. ఈ మేరకు సమయంలో మార్పులు చేసుకుంటాను. బాగా చదువుకుని ఉన్నతంగా ఎదిగేందుకు ప్రణాళికలను రూపొందించుకుంటాను.
– కృతిక, ఎంపీసీ మొదటి సంవత్సరం
తప్పిదాలను సరిదిద్దుకుంటా..
చిన్న చిన్న పొరపాట్లను సరిదిద్దుకుంటూ కొత్త సంవత్సరంలో మరింత ఉత్సాహంగా ముందుకెళ్లే విధంగా ప్రయత్నిస్తాను. చదువుపై ప్రత్యేక దృష్టిసారించి జీవిత లక్ష్యమైన జేఈఈ మెయిన్స్ క్రాక్ చేసే విధంగా కృషి చేస్తా. మంచి ఆలోచలనతో కొత్త సంవత్సరంలోకి అడుగుపెడతాం.
– ప్రతిక, ఎంపీసీ మొదటి సంవత్సరం
ఎంబీబీఎస్ సీటు సాధిస్తా..
ఎంబీబీఎస్ సీటు సాఽధించాలన్నదే నా లక్ష్యం. కొత్త సంవత్సరంలో సీటు సాధించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకుని ప్రణాళికా బద్ధంగా చదువుకుంటాను. నీట్‌కు పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతా. చదువులో మరింత ఉత్సాహంగా ముందుకెళ్తా.
– దీక్షిత, బైపీసీ మొదటి సంవత్సరం
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: గత జ్ఞాపకాలను సజీవంగా ఉంచుకొని కొత్త సంవత్సరంలో నూతనోత్సాహంతో ముందుకెళ్తామని విద్యార్థులు పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలోని వాగ్దేవీ జూనియర్ కళాశాలలో బుధవారం ‘సాక్షి’ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టాక్ షోకు మంచి స్పందన లభించింది. కళాశాల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. కొత్త సంవత్సరంలో ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని సరికొత్త ఆలోచనలతో ముందుకెళ్తామన్నారు. జీవితంలో ఉన్నతంగా ఎదిగేందుకు, అనుకున్న లక్ష్యాలను సాధించేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటామని.. గతంలో చేసిన తప్పిదాలను సరిదిద్దుకుంటామని పేర్కొన్నారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
కోటి ఆశలతో కొత్త సంవత్సరంలోకి అడుగు
సరికొత్త ఆలోచనలు, కార్యాచరణతో విజయ తీరాలకు
‘సాక్షి’ టాక్ షోలో వాగ్దేవీ జూనియర్ కళాశాల విద్యార్థులు
ఉన్నత లక్ష్యాలతో ముందుకు..
ఉన్నత లక్ష్యాలతో ముందుకు..
ఉన్నత లక్ష్యాలతో ముందుకు..
ఉన్నత లక్ష్యాలతో ముందుకు..


