కనులపండువగా శ్రీనివాస కల్యాణం
స్టేషన్ మహబూబ్‌నగర్: వైకుంఠ ఏకాదశి ఉత్సవాల్లో భాగంగా పిల్లలమర్రి రోడ్డులోని కంచికామకోఠి పీఠం శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని బుధవారం తెల్లవారుజామున సుప్రభాత సేవ, ధనుర్మాస పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీనివాస కల్యాణ మహోత్సవాన్ని కనులపండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా కల్యాణ వైభవాన్ని గొండ్యాల రాఘవేంద్రశర్మ, ఉత్తర ద్వారా దర్శన వైభవాన్ని తోటపల్లి శ్రీకాంత్‌శర్మ, గోవింద నా వైభవాన్ని ఇరువింటి శ్రవణ్‌కుమార్ శర్మ భక్తులకు వివరించారు. కార్యక్రమంలో శ్రీవేంకటేశ్వర సేవా మండలి సభ్యులు గుండా వెంకటేశ్వర్లు, సుదర్శన్‌గౌడ్, విజయభాస్కర్‌రెడ్డి, నందకిషోర్, మిర్యాల వేణుగోపాల్, లక్ష్మయ్య, నాగరాజు, అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి అధ్యక్షులు సీమ నరేందర్ పాల్గొన్నారు.
శ్రీనివాస కల్యాణం నిర్వహిస్తున్న పండితులు


