సాలార్‌నగర్ ‘భూ ఆధార్’ సర్వే పనులు త్వరగా పూర్తి చేయా
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): గండేడ్ మండలం సాలార్‌నగర్‌లో ‘భూ ఆధార్’ సర్వే పైలట్ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు ద్వారా గ్రామంలోని ప్రతి భూ యజమానికి సంబంధించిన భూమి వివరాలను స్పష్టమైన సరిహద్దులతో పాటు కచ్చితమైన అక్షాంశాలు, రేఖాంశాలతో గుర్తించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. సర్వే పనులను వేగవంతం చేయాలని, అమలు సమయంలో ఎదురయ్యే సమస్యలు, అభ్యంతరాలను తక్షణమే పరిష్కరించాలని సూచించారు. సమావేశంలో ఆర్డీఓ నవీన్, అసిస్టెంట్ డైరెక్టర్ ల్యాండ్ సర్వే అశోక్, తహసీల్దార్లు, సర్వేయర్లు, తదితరులు పాల్గొన్నారు.


