ముఖగుర్తింపు హాజరు అమలు..
పలు హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్..
పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక విద్య..
విద్యలో అనేక మార్పులు..
ఇంటిగ్రేటెడ్ పాఠశాలల ఏర్పాటు..
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న 2,400 పాఠశాలల్లో చదువుతున్న 2.60 లక్షల మంది విద్యార్థులకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో ముఖగుర్తింపు హాజరు విధానం అమలులోకి తీసుకొచ్చింది. దీంతోపాటు 16,200 మంది ఉపాధ్యాయులకు కూడా ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఉపాధ్యాయులు పని సమయంలో సెల్‌ఫోన్లు వినియోగించరాదని ప్రభుత్వం జీవో తీసుకొచ్చింది. ఈ సంవత్సరం నుంచి ఉపాధ్యాయులు సైతం టెట్ అర్హత సాధించాలని ఆదేశించింది. అన్ని కేజీబీవీలు, హాస్టళ్లు, గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు మెనూను మార్చింది. ఉదయం అల్పాహారం, వారంలో 5 సార్లు కోడిగుడ్డు, రెండుసార్లు మాంసం అందించాలని సూచించింది. మెస్ ఛార్జీలు సైతం పెంచింది.
ప్రైమరీ పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రీ ప్రైమరీ విద్య ప్రారంభించింది. మహబూబ్‌నగర్ జిల్లాలో 75 పాఠశాలల్లో ఏర్పాటు చేయగా.. ఉమ్మడి జిలాలో 280 పాఠశాలల్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రీప్రైమరీలో చిన్నారులకు ఆట బొమ్మలు తదితర అవసరమైన అన్ని వసతులతో బోధన సాగనుంది.
మహబూబ్‌నగర్ జిల్లాలోని 64, ఉమ్మడి జిల్లాలో 190కి పైగా పాఠశాలల్లో ఏఐ విద్య అందిస్తున్నారు. మూడు పాఠశాలల్లో కలెక్టర్ నిధులతో ఆస్ట్రానమీ ల్యాబ్‌ల ఏర్పాటుకు ముందుకొచ్చారు. విద్యార్థులకు సైన్స్‌పై అవగాహన పెంచేందుకు ల్యాబ్‌ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.
నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఉమ్మడి జిల్లాలో 14 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో పాఠశాలకు సుమారు రూ.200 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేయనుంది. ఒక్కో పాఠశాలలో సుమారు 2 వేలకు పైగా విద్యార్థులకు ప్రవేశాలు కల్పించనున్నారు. 25 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణానికి అధికారులు స్థలాలను పరిశీలించారు. వీటిలో సింథటిక్ ట్రాక్, ల్యాబ్, తరగతి గదులు, హాస్టల్, డైనింగ్, కంప్యూటర్ ల్యాబ్ వంటి సకల సౌకర్యాలు కల్పించనున్నారు.
నాగర్‌కర్నూల్ జిల్లా ఉయ్యాలవాడ బీసీ సంక్షేమ వసతిగృహంలో జులై 27న కలుషిత ఆహారం తిని సుమారు 30 మంది విద్యార్థులు ఆస్పత్రిలో చేరారు. పెద్దకొత్తపల్లి ఎస్సీ గురుకులంలో 15 మంది విద్యార్థులు అస్వస్థతకు గురికాగా, వనపర్తి, గద్వాలలోని పలు హాస్టల్స్‌లో ఇలాంటి ఘటనలు చో టు చేసుకున్నాయి. గద్వా జిల్లా ఎర్రవల్లి గురుకులంలో ఫుడ్ పాయిజన్‌తో 10 మంది విద్యార్థులు ఆస్పత్రి పాలయ్యారు.


