పోలీస్ నిఘాలో శ్రీశైలం రహదారి
దోమలపెంట: హైదరాబాద్, శ్రీశైలం రహదారిలో నల్లమల పరిధిలో పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. వివరాల ప్రకారం ఇటీవల హైదరాబాద్ కు చెందిన మహిళ శ్రీశైలంలో స్వామివారి దర్శనం చేసుకొని తిరుగు ప్రయాణమైంది. ఈ క్రమంలో బ్రహ్మగిరి అటవీ చెక్‌పోస్ట్ దాటి కొంతదూరం వెళ్లిన కారు నిలిపి కిందకు దిగగా.. తనను ఓ వ్యక్తి వెంబడించాడని సోషల్ మీడియాలో ఆ మహిళ పోస్ట్ చేసి ఆందోళన వ్యక్తం చేసింది. ఈ వీ డియో వైరల్ కావడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు దీనిపై స్పందించా రు. వెంబడించిన వ్యక్తి దారి దోపిడి చేసే వ్యక్తేమోనని శ్రీశైలానికి రాకపోక లు సాగించే భక్తులు, పర్యాటకులు భావిస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేస్తుడడంతో అమ్రాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. సీఐ శంకర్‌నాయక్ ఆదేశాల మేరకు నల్లమలలోని శ్రీశైలం ప్రధాన రహదారిలో పోలీసుల పికెటింగ్ చేస్తున్నట్లు దోమలపెంట ఎస్‌ఐ జయన్న మంగళవారం తెలిపారు. శ్రీశైలానికి వచ్చే భక్తులు, పర్యాటకులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రహదారి మొత్తం పోలీసుల నిఘాలో ఉందని భరోసా కల్పించారు.
‘ట్రెండ్ హ్యుందాయ్’ షోరూం 2.0 ప్రారంభం
పాలమూరు: ట్రెండ్ హ్యుందాయ్ నూతన కారు షోరూం 2.0ను ట్రెండ్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ గట్టు గోపాల్‌రెడ్డి మంగళవారం జిల్లా కేంద్రంలోని అప్పన్నపల్లిలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ నూతన షోరూం కస్టమర్ల అభిరుచికి అనుగుణంగా, అత్యాధునికంగా అభివృద్ధి చేశామన్నారు. ఇందులో ప్రీమియం కస్టమర్ లాంజెస్, న్యూకార్ డెలివరీ ఏరియా, కస్టమర్ ఇంటరాక్షన్ క్యాబిన్, డిజిటల్ ఇంటరాక్షన్, డిజిటల్ కీయాస్క్, ఈవీ కార్ సర్వీసింగ్‌బే, చార్జింగ్ పాయింట్ వంటి సౌకర్యా లు కల్పించామని వెల్లడించారు. కార్యక్రమంలో ట్రెండ్ గ్రూప్ డైరెక్టర్ గట్టు సంయుక్తారెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గట్టు సిరి చందనరెడ్డి, షోరూం సేల్స్ మేనేజర్ హర్షవర్ధన్‌రెడ్డి, సర్వీస్ మేనేజర్ వసీమ్, సిబ్బంది పాల్గొన్నారు.
పోలీస్ నిఘాలో శ్రీశైలం రహదారి


