గాయపడిన వ్యక్తి మృతి
జడ్చర్ల: రోడ్డు ప్రమాదానికి గురైన ఓ వ్యక్తికి వైద్యం అందించినా నయం కాకపోవడంతో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. సీఐ కమలాకర్ కథనం మేరకు.. మండలంలోని ఉదండాపూర్ గ్రామానికి చెందిన కావలి చెన్నయ్య (47) ఈ నెల 22న పోలేపల్లి సెజ్‌లోని పరిశ్రమలో పని చేసేందుకు మోటార్ బైక్‌పై వెళ్లాడు. అదే రోజు రాత్రి 11 గంటల సమయంలో విధులు ముగించుకొని బైక్‌పై ఇంటికి బయలు దేరగా సెజ్ ప్రధాన రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని వెంటనే అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం సోమవారం ఇంటికి తీసుకురాగా.. పరిస్థితి విషమించి మంగళవారం మృతి చెందాడు. తన భర్త మరణానికి కారణమైన గుర్తు తెలియని వాహనాన్ని గుర్తించి చట్టపరమైన చర్యలు చేపట్టి తమకు న్యాయం చేయాలని మృతుడి భార్య చెన్న కృష్ణమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
నీటి సంపులో పడి
బాలుడు మృతి
కల్వకుర్తి రూరల్: మండలంలోని మార్చాల గ్రామంలోని మా మిడితోటలో నీటి సంపులో పడి హర్షిత్(2) బాలు డు మృతి చెందిన విషాద ఘటన మంగళవారం చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు.. గ్రామంలోని మామిడి తోటలో చెట్ల పాదులు తీసేందుకు వంగూరుకు చెందిన మంజుల, మల్లేష్ దంపతులు కూలికి వచ్చారు. భార్యాభర్తలు పనిచేస్తుండగా వారి కుమారుడు హర్షిత్ ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు నీటి సంపులో పడిపోయాడు. బాబు కోసం వెతకగా సంపులో పడి ఉండటాన్ని గుర్తించి కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు.
ఉరి వేసుకొని యువకుడి బలవన్మరణం
నారాయణపేటఎడ్యుకేషన్: మండలంలోని భై రంకొండ గ్రామానికి చెందిన కంకరి మధు (23) అనే యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం జరిగింది. గ్రామ శివారులోని సంతోష్ వెంచర్ బల్డింగ్ మెట్లకు ఉన్న కడ్డీలకు ఉదయం 7 గంటల ప్రాంతంలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పాడ్డాడు. విషయం తెలుసుకున్న స్థా నికులు, కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మహబూబ్‌నగర్‌లో ఉన్న హీరో ఫైనాన్స్‌లో దాదాపు రూ. 6,00,000 లోన్ తీసుకొని జమ చేసిన కూడా వారు అకౌంట్‌లో జమ చేయకుండా మోసం చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు.


