పత్తి పంట దగ్ధం
అడ్డాకుల: మండలంలోని బలీదుపల్లి శివారులో ఓ షెడ్డు లో నిల్వ చేసిన పత్తి కి గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టడంతో కాలిపో యిన ఘటన మంగళవారం ఉద యం చోటుచేసుకుంది. బాధితుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రైతు కుమ్మరి నర్సింహ తన వ్యవసాయ పొలంలో పండించిన పత్తిని పొలంలోని గేదేల షెడ్డులో నిల్వ చేశాడు. ఉదయం 11 గంటల సమయంలో గుర్తు తెలియని దుండగులు షెడ్డులో ఉన్న పత్తికి రెండు చోట్ల నిప్పు పెట్టారు. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగి పొగ రావడంతో పరిసర రైతులు గుర్తించి వెంటనే నర్సింహ కుటుంబ సభ్యులకు ఫోన్ చేశా రు. షెడ్డు గ్రామానికి దగ్గరలో ఉండడంతో చుట్టుపక్కల వారందరు వచ్చి నీళ్లతో మంటలను ఆర్పేశారు. నిల్వచేసిన పత్తి పనికి రాకుండా మారింది. ఈ ఘటనలో సుమారు రూ.లక్ష వరకు నష్టం వాటిల్లినట్లు బాధిత రైతు తెలిపారు. దీనిపై 100కు సమాచారం ఇవ్వడంతో అడ్డాకుల పోలీస్‌స్టేషన్ నుంచి వచ్చిన కానిస్టేబుల్ విచారణ చేసి వివరాలను సేకరించారు. ఘటనపై బాధితులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. పత్తికి నిప్పు పెట్టింది ఎవరన్నది తెలియరాలేదు.బాధిత రైతును ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.


