సాఫ్ట్‌బాల్‌లో బాలికల జట్టు విజేత
మంచిర్యాల జిల్లా మందమర్రిలో ఆదివారం ముగిసిన రాష్ట్రస్థాయి అండర్–19 స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ బాలికల సాఫ్ట్‌బాల్ టోర్నమెంట్‌లో ఉమ్మడి జిల్లా జట్టు మెరుగైన ప్రతిభ కనబరిచింది. ఫైనల్ మ్యాచ్‌లో మహబూబ్‌నగర్ జట్టు 2–0 పాయింట్ల తేడాతో నిజామాబాద్‌పై గెలుపొంది చాంపియన్‌షిప్ కై వసం చేసుకుంది. బాలికల జట్టు ప్రథమ స్థానంలో నిలవడంపై జిల్లా
ఎస్‌జీఎఫ్ కార్యనిర్వాహక కార్యదర్శి శారదాబాయి, పీడీలు వేణుగోపాల్, నాగరాజు, సరిత హర్షం వ్యక్తం చేశారు. – మహబూబ్‌నగర్ క్రీడలు


