యువకుడి ఆత్మహత్య
మదనాపురం: అప్పుల బాధ తాళలేక యువకుడు ప్రాణాలు తీసుకున్న విషాద ఘటన బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. చిన్నచింతకుంట మండలం ఉంధ్యాలకు చెందిన మాల వినోద్‌కుమార్ (28) కొంతకాలంగా ఆత్మకూరులో నివాసం ఉంటున్నాడు. అప్పులు ఎక్కువగా ఉండడంతో కొద్దిరోజులుగా తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే ఉదయం సుమారు 6గంటల ప్రాంతంలో కొత్తపల్లి బ్రిడ్జి వద్దకు చేరుకుని, నీటిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య లావణ్య, కుమారుడు ఉన్నారు. చేతికి అందిన కొడుకు మరణించడంతో ఆ కుటుంబంలో తీరని శోకం నెలకొంది. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్‌ఐ శేఖర్‌రెడ్డి తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వనపర్తి ఆస్పత్రికి తరలించారు.
అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి
బల్మూర్: మండలంలోని పోలేపల్లి గ్రామానికి చెందిన కృష్ణమ్మ అనే మహిళ అనుమానాస్పద స్థితితో మృతి చెందింది. ఎస్‌ఐ రాజేందర్, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన చిట్టిగోరి కృష్ణమ్మ(45) భర్త విష్ణుతో కలిసి హైదరాబాద్‌లో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంది. ఈ క్రమంలో ఈ నెల 22న అనారోగ్యంతో ఎవరికి సమాచారం ఇవ్వకుండా హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి వచ్చింది. కుటుంబ సభ్యులు నాగర్‌కర్నూల్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అనంతరం గ్రామానికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం ఇంటి నుంచి పాల కోసం వెళ్లిన కృష్ణమ్మ ఎంతకు తిరిగి రాలేదు. ఆచూకీ కోసం వెతకగా తన ఇంటి వెనుక చెట్లపొదల్లో శవమై కనిపించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతురాలి కుమారుడు భానుప్రసాద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
విద్యుదాఘాతంలో
రెండు దుకాణాలు దగ్ధం
మహబూబ్‌నగర్ క్రైం: మొబైల్ దుకాణంలో ఏర్పడిన షార్ట్‌సర్క్యూట్ కారణంగా రెండు దుకాణాల్లో ఉన్న సామగ్రితో పాటు ఇంట్లో కిచెన్‌లో వస్తువులు దగ్ధమైన ఘటన బుధవారం చోటుచేసుకుంది. అగ్నిమాపక శాఖ అధికారి మల్లికార్జున్ కథనం ప్రకారం.. నగరంలోని ఎంబీసీ చర్చి ఎదురుగా ఉన్న కేజీఎన్ మొబైల్ దుకాణంలో బుధవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో షార్ట్‌సర్క్యూట్ వల్ల మంటలు ఏర్పడ్డాయి. దుకాణంలో ఉన్న మొబైల్ సామగ్రితో పాటు ఇతర వస్తువులు దగ్ధం కావడంతో మంటలు పక్క దుకాణంలోకి వ్యాప్తించి అందులోని ఎలక్ట్రిక్ వస్తువులు కాలిపోయాయి. దుకాణం వెనుక భాగంలో ఉన్న ఇంట్లోకి సైతం మంటలు వ్యాపించి కిచెన్‌లో ఉన్న ఫ్రీజ్ ఇతర వస్తువులు, సామన్లు దగ్ధమయ్యాయి. ఘటన స్థలానికి ఫైర్ ఇంజన్ చేరుకుని మంటలు అదుపు చేసినట్లు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో
యువకుడి దుర్మరణం
జడ్చర్ల: మండలంలోని గంగాపూర్‌కు చెందిన వడ్ల యాదగిరి (28) బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందినట్లు సీఐ కమలాకర్ తెలిపారు. జడ్చర్ల నుంచి బైక్‌పై స్వగ్రామానికి వెళ్తుండగా.. గ్రామ సమీపంలో ఎదురుగా వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీకొట్డడంతో కిందపడి తీవ్రంగా గాయపడ్డాడని చెప్పారు. వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు సీఐ వివరించారు.
ట్రాక్టర్ కింద పడి వ్యక్తి..
వనపర్తి రూరల్: ట్రాక్టర్ కింద పడి వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలో చోటు చేసుకున్నది. ఏఎస్‌ఐ ఎండీ సాజిద్‌అలి తెలిపిన వివరాల ప్రకారం.. చిట్యాల గ్రామానికి సూగూరు మహేష్ (29) మంగళవారం పొలం దగ్గరుకు వెళ్లి సాయంత్రం ఇంటికి తిరిగి వస్తున్నాడు. మార్గమధ్యంలో చవటబావి దగ్గర ఊర చెరువు కాల్వకట్టపై వెనకాల వస్తున్న ట్రాక్టర్ డ్రైవర్ బాలకృష్ణ ఎదుట ఉన్న వాహనాలను తప్పించబోయి మహేష్‌ను ఢీకొనడంతో అతడు కాల్వలో పడగా.. ట్రాక్టర్ మీదపడడంతో తీవ్రగాయాలయ్యాయి. వెంటనే వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు పరీక్షి ంచి అప్పటికే మృతి చెందాడని తెలిపారు. మృతుడి అన్న సూగూరు భాస్కర్ బుధవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్‌ఐ తెలిపారు.
యువకుడి ఆత్మహత్య


