ఉత్సాహంగా వాలీబాల్ క్రీడాకారుల ఎంపికలు
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంలో ఆదివారం ఉమ్మడి జిల్లా జూనియర్ బాలబాలికల జట్ల ఎంపికలు నిర్వహించారు. జిల్లా వాలీబాల్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ ఎంపికలకు 90మంది క్రీడాకారులు హాజరైనట్లు తెలిపారు. రాష్ట్రస్థాయి వాలీబాల్ టోర్నీలో ఉమ్మడి జిల్లా జట్లు విజేతలు నిలవాలని ఆకాంక్షించారు. టోర్నీలో క్రీడాస్ఫూర్తిని చాటాలని కోరారు. రాజన్న సిరిసిల్లలో ఈ నెల 29 నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు రాష్ట్రస్థాయి అంతర్‌జిల్లా జూనియర్ వాలీబాల్ టోర్నమెంట్ ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వాలీబాల్ అసోసియేషన్ కార్యదర్శి మహ్మద్ హనీఫ్, కార్యనిర్వాహక కార్యదర్శి చెన్న వీరయ్య, నర్సింహరాజు, వజీర్, దస్తగీర్‌ఖాన్, కోచ్ పర్వేజ్‌పాష పాల్గొన్నారు.


