నాసిరకం బీటీ రోడ్డును తవ్వేశారు
● కొత్త బీటీ వేసేందుకు
అధికారుల చర్యలు
జడ్చర్ల: నాసిరకం పనులతో కొత్తగా వేసిన బీటీ రోడ్డు రెండు రోజులకే బీటలుగా ఊడి వస్తున్న విషయాన్ని శనివారం ‘సాక్షి’ దినపత్రికలో బాబోయ్.. రోడ్డు వేసేది ఇలాగేనా? అనే శీర్షికతో వచ్చిన కథనానికి సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించారు. ఆదివారం సదరు నాణ్యత లేని బీటీ రోడ్డును డోజర్ సహాయంతో తవ్వేశారు. బాలానగర్ మండలంలోని పెద్దరేవల్లి నుంచి దేవునిగుట్టతండా వరకు రూ.కోట్లు వెచ్చించి నిర్మించిన బీటీ రోడ్డు పెచ్చులుపెచ్చులుగా ఊడి రావడంపై ప్రజల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. దీనిపై ‘సాక్షి’ లో కథనం రావడంతో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి సైతం సదరు కాంట్రాక్టర్, అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో వెంటనే రంగంలోకి దిగిన అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. నాణ్యతతో కూడిన కొత్త బీటీ రోడ్డు వేసేందుకు నిర్ణయించారు.
నాసిరకం బీటీ రోడ్డును తవ్వేశారు
నాసిరకం బీటీ రోడ్డును తవ్వేశారు


