
విద్యార్థులు ఏకాగ్రతతో చదవాలి
అడ్డాకుల: మూసాపేట మండలం సంకలమద్ది శివారులో ఉన్న కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని బుధవారం కలెక్టర్ విజయేందిర బోయి సందర్శించారు. పదో తరగతి విద్యార్థుల తరగతి గదికి వెళ్లి బాలికలతో మాట్లాడారు. విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించారు. విద్యార్థులకు కంప్యూటర్‌పై ఎంత అవగాహన ఉందన్న దానిపై ఆరా తీశారు. పదో తరగతి విద్యార్థులపై అధ్యాపకులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. విద్యార్థులు ఏకాగ్రతతో చదవాలని చెప్పారు. అలాగే కస్తూర్భాలో విద్యార్థుల వసతి, ఇతర సౌకర్యాల గురించి కలెక్టర్ ఆరా తీశారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు శివేంద్రప్రతాప్, నర్సింహారెడ్డి, డీఈఓ ప్రవీణ్‌కుమార్, ఎంఈఓ రాజేశ్వర్‌రెడ్డి ఉన్నారు.